Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
- భారత మార్కెట్లో కొత్త హై-పర్ఫార్మెన్స్ సెడాన్ Mercedes-Benz AMG E 53
- రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర
- 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో తన కొత్త హై-పర్ఫార్మెన్స్ సెడాన్ Mercedes-Benz AMG E 53ను అధికారికంగా విడుదల చేసింది. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ లగ్జరీ సెడాన్ ప్రీమియం కార్ల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. 585 హార్స్పవర్ ఇంజిన్, కేవలం 3.8 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకునే సామర్థ్యంతో ఈ కారు పనితీరు ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
Mercedes-Benz AMG E 53 ధర
భారత మార్కెట్లో Mercedes-Benz AMG E 53ను కంపెనీ రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. సాధారణ E-Classతో పోలిస్తే AMG E 53 మరింత ఆకర్షణీయమైన స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కారులో అందించిన ముఖ్యమైన ఫీచర్లు.. LED హెడ్‌ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), AMG స్టైల్ ఫ్రంట్ గ్రిల్, బూట్ లిడ్ స్పాయిలర్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.
Also Read
- TVS Callisto 110: టీవీఎస్ Callisto 110 స్కూటర్ లాంచ్.. 33 లీటర్ల స్టోరేజ్, బ్లూటూత్, నావిగేషన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Chery Tiggo: విరిగిన యాక్సిల్.. ఊడిపోయిన చక్రాలు! భారత్ మార్కెట్లోకి రాకముందే చైనా కార్ల బ్రాండ్ పరువు గాల్లోకి..
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
- రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
14.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, Burmester, ప్రీమియం ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, Android Auto & Apple CarPlay, 360-డిగ్రీ కెమెరా. Mercedes-Benz AMG E 53లో 3.0-లీటర్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను అందించారు. ఈ ఇంజిన్ 585 హార్స్పవర్, 750 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అలాగే 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌ను కూడా అందించారు.
కేవలం 3.8 సెకన్లలో 100 kmph
AMG Performance Plus ప్యాకేజీతో ఈ కారు గరిష్టంగా 612 హార్స్పవర్ వరకు శక్తిని అందిస్తుంది. దీంతో 0-100 kmph వేగం – కేవలం 3.8 సెకన్లు
గరిష్ట వేగం – 280 kmph అందుకోగలదు. శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, అద్భుతమైన స్పోర్టీ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు, 3.8 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకునే పనితీరుతో Mercedes-Benz AMG E 53 భారత మార్కెట్లో ప్రీమియం స్పోర్ట్స్ సెడాన్ విభాగంలో బలమైన పోటీదారుగా నిలవనుంది. అధిక పనితీరు, లగ్జరీ, ఆధునిక ఫీచర్లను కోరుకునే కస్టమర్లకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా ఉండనుంది.
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ ఇంటిమేట్ సీన్ల గురించి మా ఆయన నాతో మాట్లాడలేదు..
-
El Nino: ఎల్‌నినో దెబ్బ.. చుట్టుముడుతున్న వ్యాధులు..WHO సంచలన ప్రకటన!
-
Pat Cummins: ట్యాంపరింగ్ కలకలం.. పబ్లిక్‌లోనే భార్యతో గొడవ.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక ప్రకటన..
-
Smoking Vs Alcohol: స్మోకింగ్ మానడమే కష్టమా? ఇందులో నిజమెంత?
-
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!