Maruti Suzuki Victoris: మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ధరలను అప్పుడే పెంచేసింది. ఈ ఎస్‌యూవీని సెప్టెంబర్ 2025లో లాంచ్ చేసినప్పటి నుంచి ధరల సవరణ జరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ZXi+ (O) సిక్స్ స్పీడ్ మాన్యువల్, ZXi+ (O) సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్‌ల ధరలను ఒక్కొక్కటిగా రూ. 15,000 చొప్పున పెంచింది. మిగిలిన వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కంపెనీ ప్రకటించింది.
మారుతి సుజుకి ఎరీనా నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడుతున్న విక్టోరిస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 10.50 లక్షలు. లాంచ్ అయిన నుండి ఈ ఎస్‌యూవీ భారతదేశంలో 25,000 బుకింగ్‌లను సాధించింది. భద్రత విషయంలో విక్టోరిస్ అత్యంత కీలకంగా మారింది. ఇది గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీనితో మారుతి సుజుకి చరిత్రలోనే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా నిలిచింది.
PAK vs SA: 38 ఏళ్ల వయసులో అరంగేట్రం.. 6 వికెట్లతో 92 ఏళ్ల రికార్డు బద్దలు!
విక్టోరిస్ ఎస్‌యూవీ LXi, VXi, ZXi, ZXi(O), ZXi+, ZXi+(O) అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ మోడల్‌లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో), 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS సూట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
