Maruti Suzuki: ఇండియన్ కార్ మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి సుజుకికి ‘‘ధన్‌తేరాస్’’ కలిసి వచ్చింది. తన అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. రెండు రోజుల పండగ కాలంలో 50,000 కార్లను డెలివరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శనివారం సాయంత్రం నాటికి కంపెనీ ఇప్పటికే దాదాపు 38,500 వాహనాలను డెలివరీ చేసింది. శనివారం చివరి నాటికి 41,000 యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ చెప్పారు. మొత్తం డెలివరీలు 51,000 యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 41,000 డెలివరీలతో పోలిస్తే, ఇది 10 వేలు ఎక్కువ.
Read Also: Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ సన్నద్ధం.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లు..!
ఈ ఏడాది ధన్‌తేరాస్ శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంది. కొంత మంది కస్టమర్లు శనివారం మెటల్ కొనేందుకు వెనకాడినప్పటికీ, మొత్తానికి స్పందన మాత్రం అద్భుతంగా ఉంది అని ఆయన అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్లే డిమాండగ్ పెరిగిందని కంపెనీ చెబుతోంది. మారుతి సుజుకీ ధర తగ్గించినప్పటి నుంచి 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయి. పండగ సీజన్‌లో మారుతీ సుజుకీ రిటైల్ అమ్మకాలు ఇప్పటికే 3.25 లక్షలు దాటాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ వృద్ధిని సూచిస్తుంది.
