Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..

  • మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో విడుదల.
  • ప్రారంభ ధర రూ.7.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్).
  • పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లు.
  • భారత్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.
  • 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, అండర్‌బాడీ CNG ట్యాంక్
Maruti Suzuki Brezza Facelift

Maruti Suzuki Brezza Facelift

Maruti Suzuki Brezza Facelift: కార్ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ శుక్రవారం భారత మార్కెట్‌లో లాంచ్ అయింది. స్టైలిష్ డిజైన్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులు చేసింది. దీంతో పాటు 2026 బ్రెజ్జా గతంతో పోలిస్తే ఎక్కువ ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. ఇది పెట్రోల్, టర్బో పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్‌‌లతో వస్తోంది. మరోవైపు భారత్ NCAP (B-NCAP) నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. కొత్త బ్రెజ్జా అనేక వేరియంట్లలో లభ్యమవుతోంది. CNG ట్యాంకును కార్ అండర్ బాడీకి మార్చింది. దీంతో బూట్ స్పేస్ మరింత కలిసి వస్తుంది.

ఆకర్షణీయమైన ధర, కాంపాక్ట్ SUVలో గట్టి పోటీ..

బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రాకతో భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ SUV విభాగంలో భారీ పోటీ నెలకొంది. ఈ కారు హ్యుందార్ వెన్యూ. టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV3XO, కియా సోనెట్‌లో పోటీ పడబోతోంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 7.39 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో కార్‌ను రిలీజ్ చేసింది.

ఇంజన్ ఆప్షన్లు:

మారుతి సుజుకి బ్రెజ్జాకు ఎట్టకేలకు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. ఈ ఇంజన్ 110 హెచ్‌పి, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 103 హెచ్‌పి, 139 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత బ్రెజ్జాలో ఈ ఇంజన్‌ను వాడారు. సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్‌లో 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంది.

కొత్త డిజైన్, ప్రీమియం ఇంటీరియర్:

ఎక్స్‌టీరియర్‌లో కొన్ని మార్పులు చేశారు. ముందు భాగంలో డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌తో ప్యానెల్‌లను కలిపే హెడ్ ల్యాంప్‌లతో కూడిన కొత్త గ్రిల్ ఉంది. బంపర్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. LED హెడ్‌ల్యాంప్స్, L-షేప్ DRLs ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటీరియర్‌లో 10.1 అంగుళాల SmartPlay Pro+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బిల్ట్-ఇన్ నావిగేషన్, అలెక్సా సపోర్ట్, 64-కలర్ అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.