Mahindra XEV 9E, BE 6: మహీంద్రా అండ్ మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన XEV 9E, BE 6 కార్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలో టెక్ లోడెడ్, సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. మహీంద్రా BE 6 ప్రారంభ ధర రూ. 18.90(ఎక్స్-షోరూం) కాగా, XEV 9e స్టార్టింట్ ఫ్రైజ్ రూ. 21.90 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. అయితే, తాజాగా ఈ మహీంద్రా ఈ కార్‌కు సంబంధించి టాప్ వేరియంట్ల ధరల్ని ప్రకటించింది.
మహీంద్రా BE 6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్యాక్ వన్, ప్యాక్ టూ, ప్యాక్ త్రీ వేరియంట్లతో వస్తోంది. ప్యాక్ త్రీ ధర రూ. 26.90 లక్షలు(ఎక్స్-షోరూం)గా ప్రకటించింది. మహీంద్రా XEV 9e కూడా మూడు వేరియంట్‌లు- ప్యాక్ వన్, ప్యాక్ టూ, ప్యాక్ త్రీగా రాబోతోంది. టాప్ వేరియంట్ ప్యాక్ త్రీ ధర రూ. 30.50 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించింది.
రెండు కార్లకు సంబంధించి జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు దేశంలోని వివిధ నగరాల్లో టెస్ట్ డ్రైవ్స్ నిర్వహిస్తారు. బుకింగ్స్ ఫిబ్రవరి 14 నుంచి మొదలు కానున్నాయి. మార్చి మొదట్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నారు.
Read Also: Kushboo: హీరో విశాల్ అనారోగ్యం పై… స్పందించిన నటి కుష్బూ.. !
మహీంద్రా BE 6 :
మహీంద్రా BE 6 టాప్ వేరియంట్ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్క ఛార్జ్‌తో 682 కి.మీ రేంజ్ ఇస్తుంది. 175 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని 20 నిమిషాల్లో 20 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీంట్లో 59 kWh బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్ కూడా ఉంది. దీని రేంజ్ 535 కి.మీ గా ఉంది.
మహీంద్రా XEV 9e:
మహీంద్రా XEV 9e కూడా రెండు బ్యాటరీ ఆఫ్షన్లను కలిగి ఉంది. 79 kWh బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌తో 656 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. 286 bhp పవర్‌ని, 380 Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 59 kWh బ్యాటరీ ప్యాక్ 542 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది.