Site icon NTV Telugu

Insurance: షోరూంలో వాహనానికి యాక్సిడెంట్ అయితే, ఇన్సూరెన్స్ వస్తుందా..?

Thar Accident

Thar Accident

Insurance: ఢిల్లీలో సోమవారం, కొత్త మహీంద్రా థార్ కారు షోరూం నుంచి బయటకు తీస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి అంతస్తు నుంచి, అద్దాలను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటన మహీంద్రా నిర్మాణ్ విహార్ అవుట్‌లెట్‌లో జరిగింది. 29 ఏళ్ల మహిళ మాని పవార్ తన కొత్త ఎస్‌యూవీ కార్‌ని డెలివరీ తీసుకోవడానికి వచ్చింది. కార్ బయటకు తీసే ముందు, ఆచారం ప్రకారం, నిమ్మకాయను తొక్కించింది. మెల్లిగా వేగాన్ని పెంచాల్సింది పోయి, హఠాత్తుగా యాక్సిలరేటర్ నొక్కడం, కారు ఒక్కసారిగా షోరూం అద్దాలను బద్దలు కొట్టుకుని, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది.

దీని వల్ల, రూ. 27 లక్షల కొత్త కారు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, షోరూం నుంచి కారును డెలివరీ తీసుకునే సమయంలో యాక్సిడెంట్ జరిగి, కారు లేదా ఏదైనా వాహనానికి నష్టం ఏర్పడితే ‘‘ఇన్సూరెన్స్’’ క్లెయిమ్ అవుతుందా? అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.

Read Also: China – Bhutan: భూటాన్ భూమిపై చైనా కన్ను.. డ్రాగన్ చూపు పడితే నాశనమే!

నష్టాన్ని ఇన్సూరెన్స్ కవర్ చేసే అవకాశం ఉంది.

కార్ డీలర్‌షిప్ సాధారణంగా డెలివరీకి ముందే ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. కొనుగోలుదారుడు చెల్లించే ప్రీమియంతోనే ఇది కవర్ అవుతుంది. ఫలితంగా కారు షోరూం నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ యాక్టివ్ గానే ఉంటుంది.

ప్రస్తుతం, కొత్త వాహనాలకు జీరో-డిప్రిసియేషన్(జీరో-డిప్) బీమా చేస్తున్నారు. దీని వల్ల చిన్న గీతల దగ్గర నుంచి పెద్ద నష్టాల వరకు అన్నింటిని పూర్తి ఖర్చుతో బీమా సంస్థ తిరిగి చెల్లిస్తుంది. కస్టమర్ చిన్న ప్రాసెసింగ్ లేదా ఫైల్ ఛార్జీలను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే, థార్ ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు పాలసీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ మరమ్మతు ఖర్చులను ఎక్కువగా భరిస్తుంది. ఇన్సూరెన్స్ సాధారణంగా వాహనానికి మాత్రమే ఉంటుంది. థర్డ్ పార్టీ ఆస్తులకు కాదు. అందువల్ల మహీంద్రా షోరూంకు జరిగిన నస్టాన్ని చెల్లించమని కస్టమర్‌ను కోరవచ్చు.

Exit mobile version