Site icon NTV Telugu

రిలీజ్ కు రెడీ అవుతోన్న Mahindra Thar 3-Door వెర్షన్..

Thar

Thar

Mahindra Thar 3-Door: భారత్‌లో లైఫ్‌స్టైల్ ఆఫ్-రోడర్ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్ 3-డోర్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ మోడల్ మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. తాజాగా బయటకు వచ్చిన ఫొటోలు చూస్తే.. త్వరలోనే థార్ రాక్స్ (Thar Roxx) తరహాలో కొత్త డిజైన్ అప్‌డేట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. థార్ 3-డోర్ మోడల్‌ను కంపెనీ మారుతున్న స్టైల్‌కు దగ్గరగా తీసుకురావడమే ఈ అప్‌డేట్ ముఖ్య ఉద్దేశం. ఇంజిన్, చాసిస్, ప్లాట్‌ఫామ్ వంటి ముఖ్యమైన భాగాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. కానీ థార్ అవుట్ లుక్, డిజైన్ డీటైలింగ్ మాత్రం కొత్తగా, మరింత ఆకర్షణగా కనిపిస్తుంది. అంటే, మహీంద్రా థార్ 3-డోర్‌కు పవర్, ఆఫ్-రోడ్ సామర్థ్యం అలాగే ఉంచి, కేవలం డిజైన్‌ను తాజాగా మార్చి మార్కెట్లో వినియోగదారుల ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది.

Read Also: BSNL: పాపులర్ రీఛార్జ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్.. డైలీ అదనపు డేటా, 365 రోజుల వ్యాలిడిటీ

థార్ రాక్స్-ఇన్‌స్పైర్డ్ ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్
* స్పై ఫొటోల్లో కనిపించిన థార్ 3-డోర్‌లో ప్రధానంగా రాక్స్ మోడల్‌ను పోలిన స్టైలింగ్ హైలైట్స్ ఉన్నాయి.
* స్క్వేర్ ప్యాటర్న్‌తో అప్‌డేట్ అయిన ఫ్రంట్ గ్రిల్..
* కొత్తగా డిజైన్ చేసిన బంపర్
* హెడ్‌ల్యాంప్ సర్ఉండ్స్‌లో స్వల్ప మార్పులు
* కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్
* థార్ రగ్డ్, బాక్సీ లుక్‌ను అలాగే ఉంచుతూ.. ఫినిషింగ్, డిటైలింగ్ మాత్రం మరింత మోడ్రన్ & కంటెంపరరీగా మార్చింది.

Read Also: Cambodia: కంబోడియాలో విష్ణువు విగ్రహం కూల్చివేత.. భారత్ అభ్యంతరం

స్టైలింగ్‌కే మార్పులకే పరిమితం
* థార్ 3-డోర్ బేసిక్ సిల్హౌట్ (బాహ్య ఆకృతి)లో ఎలాంటి మార్పులు లేవు.
* షార్ట్ వీల్‌బేస్ ప్రొపోర్షన్స్
* రిమూవబుల్ రూఫ్ ప్యానెల్స్
* ఎక్స్‌పోజ్డ్ డోర్ హింజెస్ (కనిపించే డోర్ కీలు)

అయితే, ఇవన్నీ ఇప్పటి మోడల్‌లానే కొనసాగుతున్నాయి. ఈ అప్‌డేట్ కేవలం కాస్మెటిక్ రిఫ్రెష్ మాత్రమేనని, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మార్చకుండా షోరూమ్ ఆకర్షణను పెంచడం కోసమేనని అర్థమవుతోంది.

ఇంటీరియర్ & ఫీచర్లలో ఏమి ఆశించొచ్చు?
* స్పై ఫొటోల్లో ఇంటీరియర్ స్పష్టంగా కనిపించకపోయినా.. అప్‌డేట్ అయిన అప్హోలిస్టరీ (సీట్ల ఫ్యాబ్రిక్/లెదర్ ఫినిష్) ఉండే ఛాన్స్..
* రివైజ్డ్ ట్రిమ్ ఫినిష్‌లు
* రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌వేర్‌తో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి మార్పులు రావొచ్చని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

సేఫ్టీ ఫీచర్లు మారే అవకాశం లేదు..
* డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్
* ABS, ESC, 4×4 డ్రైవ్ ఇవి సెలెక్టెడ్ వేరియంట్లలో అలాగే కొనసాగనున్నాయి.

ఇంజిన్ & మెకానికల్ ప్యాకేజ్‌లో మార్పుల్లేవా?
* మెకానికల్‌గా థార్ 3-డోర్ ఓల్డ్ ఇంజిన్ ఆప్షన్స్‌నే కొనసాగించే ఛాన్స్..
* 2.0 లీటర్ టర్బో-పెట్రోల్
* 2.2 లీటర్ డీజిల్

మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌ అలాగే 4×4 కెపబిలిటీ..
* ఎమిషన్ కంప్లయన్స్ (BS6 ఫేజ్-2 / 2026 నాటికి వచ్చే నార్మ్స్)
* ఇంజిన్ కాలిబ్రేషన్ ట్వీక్స్ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

లాంచ్ టైమ్‌లైన్
* థార్ 3-డోర్ టెస్టింగ్ తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ అప్‌డేట్ మోడల్ 2026లోనే లాంచ్ అవొచ్చని అంచనా. రాక్స్ మోడల్‌తో కలిసి మార్కెట్లో రెండు మోడల్స్‌ కో-ఎగ్జిస్ట్ (పక్క పక్కనే) చేస్తాయి.
* కాంపాక్ట్ 3-డోర్ ఫార్మాట్ ఇష్టపడేవాళ్ల కోసం థార్ 3-డోర్
* ఎక్కువ స్పేస్, కొత్త డిజైన్ కావాలనుకునే వాళ్ల కోసం థార్ రాక్స్
* ధరలు మాత్రం కొత్త లుక్‌ కారణంగా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

Exit mobile version