Site icon NTV Telugu

Mahindra BE 6: మంటల్లో కాలిన మహీంద్రా BE 6 కార్.. అసలు కారణం ఇదే..

Be6

Be6

Mahindra BE 6: మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని గులాతి సమీపంలో మంటల్లో కాలిపోయింది. మహీంద్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు మంటల్లో చిక్కుకోవడం అందర్ని ఆశ్చర్యపరించింది. అసలు కారణాలు ఏంటనే దానిపై తాజాగా మహీంద్రా వివరాలు వెల్లడించింది. వాహనంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి గాయాలు కాలేదని కంపెనీ చెప్పింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఒక హైవేపై BE 6 కారు మంటల్లో చిక్కుకున్నట్లు చూపిస్తుంది. ఇది ఈవీ భద్రతపై ఆందోళన కలిగిచింది. అయితే, మహీంద్రా దర్యాప్తు ఈ సంఘటన బ్యాటరీకి సంబంధించిన సమస్య కాదని చెప్పింది. సెన్సార్ డేటా, సాఫ్ట్ వేర్ డయాగ్నస్టిక్స్ తర్వాత తనిఖీల్లో హై వోల్టెజ్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ ఈ సంఘటనకు కారణం కాదని తేలింది. ఈ రెండు వ్యవస్థలు పూర్తిగా చెక్కుచెదురకుండా, నిర్దిష్ట పెరామీటర్స్‌తో పనిచేస్తున్నట్లు గుర్తించారు.

Read Also: Mood of the Nation survey 2026: ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎవరిది అధికారం..? ఆసక్తికరంగా సర్వే ఫలితాలు..

అయితే, వెనక కుడి టైర్ నుంచి మంటలు సంభవించాయని, అది గాలి లేకుండా ఉన్నట్లు కంపెనీ చెప్పింది. పదే పదే టైర్ ప్రెజర్, అధిక ఉష్ణోగ్రత హెచ్చరికలు ఉన్నప్పటికీ, కారు గంటలకు 60 కి.మీ వేగంతో 10 నిమిషాలకు పైగా ప్రయాణించిందని, పూర్తిగా గాలి లేకుండా ఉన్న టైర్‌తో చాలా దూరం ప్రయాణించడం వల్ల టైర్, రోడ్డు మధ్య ఘర్షణ ఏర్పడి, అది వేడిగా మారి మంటలు అంటుకోవడానికి కారణమైనట్లు చెప్పింది.

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) వంటి భద్రతా వ్యవస్థలు టైర్‌లో గాలి లేదని, చక్రం తిరగడాన్ని నిర్వహించేందుకు అనేకసార్లు జోక్యం చేసుకున్నాయని వాహన డేటా చూపిస్తుంది. రక్షణ చర్యగా, కార్ వేగాన్ని ఎలక్ట్రానిక్‌గా పరిమితం చేశాయని, ఆ తర్వాత సిస్టమ్ పూర్తిగా షట్‌డౌన్ అయిందని, చివరకు కార్ సురక్షితంగా నియంత్రితంగా ఆగిపోయిందని సంస్థ చెప్పింది.

రికార్డ్ చేసిన వీడియోలను కూడా మహీంద్రా హైలెట్ చేస్తూ.. ముందుగా వెనక కుడి టైర్ నుంచి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోందని చెప్పింది. ఇంత తీవ్రమైన మంటల్లో కూడా హై వోల్టేజ్ బ్యాటరీ చెక్కు చెదరకుండా ఉందని, మోటార్ పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం హీంద్రా BE 6 59kWh మరియు 79kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది, దీని ధరలు రూ. 18.90 లక్షల నుండి రూ. 27.65 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. భద్రత చర్యలను, కార్ ఇచ్చే అలర్ట్స్‌ను చూసుకోవాలని తన వినియోగదారుల్ని మహీంద్రా కోరింది.

Exit mobile version