Lectrix NDuro: 120KM రేంజ్‌తో Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్

  • Lectrix NDuro ఎలక్ట్రిక్ స్కూటర్
  • రోజూ ఆఫీస్, కాలేజీకి వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్
  • Lectrix NDuro 2.0 - రూ. 87,550 (ఎక్స్-షోరూమ్)
Lectrix Nduro

Lectrix Nduro

రోజూ ఆఫీస్, కాలేజీ లేదా ఇతర పనుల కోసం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే Lectrix NDuro మంచి ఎంపికగా నిలుస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, 120 కిలోమీటర్ల వరకు రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, వేగవంతమైన ఛార్జింగ్‌తో ఈ స్కూటర్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. Lectrix NDuro రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Lectrix NDuro 2.0 – రూ. 87,550 (ఎక్స్-షోరూమ్). Lectrix NDuro 3.0 – రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). తక్కువ ధరలో మంచి రేంజ్ కోరుకునేవారికి NDuro 2.0, ఎక్కువ రేంజ్, అదనపు ఫీచర్లు కావాలనుకునేవారికి NDuro 3.0 అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ, రేంజ్

Lectrix NDuro 2.0లో 2.3kWh లిథియం-అయాన్ బ్యాటరీను అందించారు. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. Lectrix NDuro 3.0లో 3kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ అవసరం లేదు. ఇంట్లోని సాధారణ వాల్ సాకెట్‌కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేయవచ్చు. పూర్తి ఛార్జింగ్ సమయం: సుమారు 4.5 గంటలు.

పనితీరు

రెండు వేరియంట్లలోనూ 1.2kW ఎలక్ట్రిక్ మోటార్ ను అందించారు. ఈ మోటార్ వేగంగా స్పందిస్తూ స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. గరిష్ట వేగం: 65 కిమీ/గంట
0 నుంచి 40 కిమీ/గంట: కేవలం 5.1 సెకన్లు. అంతేకాకుండా, మోటార్‌కు IP67 రేటింగ్ ఉంది. దీంతో వర్షాకాలంలో లేదా నీటితో నిండిన రోడ్లపై కూడా మెరుగైన రక్షణ లభిస్తుంది.

మూడు రైడింగ్ మోడ్‌లు

రైడింగ్ అవసరాన్ని బట్టి మూడు మోడ్‌లను ఎంచుకోవచ్చు. Eco Mode, Normal Mode, Sport Mode

స్మార్ట్ ఫీచర్లు

5-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే
బ్లూటూత్ కనెక్టివిటీ
టర్న్-బై-టర్న్ నావిగేషన్
LED హెడ్‌లైట్
LED టెయిల్‌లైట్

స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌తో కనెక్ట్ చేసి నావిగేషన్ వివరాలను నేరుగా డిస్‌ప్లేపై చూడవచ్చు. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు అందించారు. అలాగే 12-అంగుళాల ట్యూబ్ టైర్లు మెరుగైన గ్రిప్, స్థిరత్వాన్ని అందిస్తాయి. లో మెయిన్ టెనెన్స్ కాస్ట్, మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో Lectrix NDuro రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే వారికి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికగా చెప్పవచ్చు.