Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ

Kove 650rr

Kove 650rr

Kove 650RR Revealed: చైనా ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Kove తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ బైక్ Kove 650RRను పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ గ్లోబల్ స్పోర్ట్స్ బైక్ లైనప్‌లో 450RR, 350RR, 250RR వంటి మోడళ్లు ఉండగా, తాజాగా 650RR చేరడంతో మరింత శక్తివంతమైన మోడల్ అందుబాటులోకి రానుంది. కొత్త Kove 650RRలో శక్తివంతమైన 645cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్, అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు, స్పోర్టీ డిజైన్‌ను అందించారు. కంపెనీ సమాచారం ప్రకారం, ఈ బైక్ గ్లోబల్ డెలివరీలు 2027 మూడో త్రైమాసికం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Kove 650RRలోని ప్రధాన ఆకర్షణ దాని కొత్త 645cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్. ఈ ఇంజిన్ 13,000rpm వద్ద 108.7hp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 11,000rpm వద్ద 60Nm టార్క్ అందిస్తుంది. ఈ పవర్ అవుట్‌పుట్‌తో Kove కంపెనీ 650RRను తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ బైక్‌గా తీసుకొస్తోంది. అధిక RPMల వద్ద భారీ పవర్ అందించే ఈ ఇంజిన్ స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

కొత్త Kove 650RRలో ట్విన్-స్పార్ ఫ్రేమ్ ను ఉపయోగించారు. ఇందులో ఇంజిన్‌ను స్ట్రెస్డ్ మెంబర్‌గా ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. అలాగే బైక్‌లో:

అల్యూమినియం సబ్‌ఫ్రేమ్
అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్
అడ్జస్టబుల్ సస్పెన్షన్
వంటి హార్డ్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి.

బైక్ కర్బ్ వెయిట్ 195 కిలోలుగా ఉంది. ఇందులో 17 లీటర్ల అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్ ను అందించారు. సీట్ హైట్ 810mmగా ఉంది. ఎలక్ట్రానిక్ ఫీచర్ల విషయంలో కూడా Kove 650RRను ఆధునిక టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఇందులో 6-యాక్సిస్ IMU ఆధారిత కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. బైక్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Standard
Sport
Custom

అంతేకాకుండా బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా అందించారు. దీని సహాయంతో రైడర్ క్లచ్ ఉపయోగించకుండా గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. Kove 650RRలో 6-ఇంచ్ TFT డిస్‌ప్లేను అందించారు. ఇది Motoplay సపోర్ట్తో వస్తుంది. రైడింగ్‌కు సంబంధించిన సమాచారం, ఇతర ఎలక్ట్రానిక్ ఫీచర్ల వివరాలను ఈ డిస్‌ప్లేలో చూడవచ్చు.

ఈ బైక్‌లో ప్రత్యేకంగా:

ఫ్రంట్ కెమెరా
రియర్ కెమెరా
లేన్ చేంజ్ అసిస్ట్
వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

స్పోర్ట్స్ బైక్ పనితీరుతో పాటు టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లకు కూడా Kove ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. బ్రేకింగ్ కోసం Kove 650RR ముందు భాగంలో ట్విన్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. వీటికి ఫోర్-పిస్టన్ కాలిపర్స్ ను జత చేశారు. వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్ అందించారు. దీనికి IMU ఆధారిత కార్నరింగ్ ABS కూడా తోడవడంతో బైక్ ఎలక్ట్రానిక్ సేఫ్టీ ప్యాకేజీ మరింత మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం Kove 650RRను భారత మార్కెట్లో విడుదల చేసే విషయంపై అధికారిక సమాచారం లేదు. కంపెనీ భారత్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను కూడా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.