NTV Telugu Site icon

Car Loan: కార్ లోన్ తీసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి.. లేదంటే అప్పుల పాలే..

Car Loan

Car Loan

మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. అయితే.. ఎక్కువ శాతం మధ్యతరగతి వ్యక్తులు కారును లోన్ తీసుకుని కొంటారు. కొందరు మాత్రమే మొత్తం డబ్బులు చెల్లిస్తారు. అయితే.. బ్యాంకులను బట్టి కార్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు కనిష్ఠంగా 8.70 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటున్నాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఈ వడ్డీ రేట్లు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని బ్యాంకులు వెహికల్ ఆన్‌-రోడ్‌ ప్రైస్‌పై 100 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఈ కార్ లోన్‌ తీర్చేందుకు 8 ఏళ్ల వరకు సమయం ఇస్తున్నాయి. ఈ కార్‌ లోన్స్‌ మీరు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తీసుకోవచ్చు. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకునేటప్పుడు 20/4/10 రూల్ మాత్రం తప్పక పాటించండి.. 20/4/10 రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

20/4/10 రూల్ అంటే ఏంటి?
బ్యాంకులో రుణం తీసుకుని కొత్త కారు కొంటున్న వారు తమ బడ్జెట్‌ను నిర్ణయించుకునేందుకు కొన్ని థంబ్ రూల్స్ సాయం చేస్తాయి. అందులో ఒకటే 20/4/10 రూల్. ఈ రూల్ ప్రకారం.. కారు ఆన్ రోడ్ ప్రైస్‌లో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించగలగాలి. లోన్ మొత్తం టెన్యూర్ గరిష్ఠంగా 4 సంవత్సరాల లోపే ఉండాలి. ఈఎంఐ మీ నెలవారీ సంపాదనలో 10 శాతానికి మించకుండా చూసుకోవాలి. ఈ విధంగా మీ బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాలి. ఇలా కచ్చితంగా ఫాలో అయినప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు.

ఉదాహరణకు.. మీ నెల సంపాదన రూ.1 లక్ష ఉంటుందని అనుకుందాం. అంటే మీ వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉంటుంది. మీరు కొత్త కారు కోనుగోలు చేద్దాం అనుకున్నప్పుడు ప్రణాళిక సిద్ధం చేయాలి. కారు ఆన్ రోడ్ ధర రూ. 6 లక్షల లోపే ఉండేలా చూసుకోవాలి. థంబ్ రూల్ లెక్క ప్రకారం కారు ఆన్ రోడ్ ధరలో 20 శాతం అంటే రూ.1.2 లక్షలు మీరు డౌన్‌పేమెంట్‌గా పే చేయాలి. మిగిలిన రూ.4.8 లక్షలు రుణంగా తీసుకోవచ్చు. మీ నెల వారీ ఈఎంఐ రూ.10 వేల వరకు ఉండేలా ప్లాన్ చేయాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు 8 శాతం లోపే వడ్డీపై కారు రుణాలు ఇస్తున్నాయి. 4 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే రూ.4.8 లక్షల రుణంపై ఈఎంఐ రూ.11,718 వరకు పడుతుంది. ఇది మాత్ర తప్పక తెలుసుకోండి.. లేదంటే భారం పెరిగి అప్పులు చేయాల్సి రావచ్చు.