Kia Syros Flex Fuel: 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌పై వివాదం నడుస్తున్న వేళ, 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఎస్‌యూవీని తీసుకువచ్చింది కియా ఇండియా. కియా సైరస్ ప్లెక్స్-ఫ్యూయల్ వెహికల్ (FFV) కాన్సెప్ట్ SUVని తీసుకువచ్చింది. ఇండియా మార్కెట్ కోసం కియా తీసుకువచ్చిన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారు ఇదే. ఇది 100 శాతం ఇథనాల్ లేదా పెట్రోల్+ఇథనాల్ కలిసిన ఇంధనంతో నడవగలదు. అయితే, ఈ ఎస్‌యూవీ ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందనే విషయాలను కియా ఇంకా వెల్లడించలేదు.
కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్: ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు:
సైరస్ FFVలో 1.0-లీటర్, మూడు సిలిండర్ల డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. అయితే, కారు పవర్, టార్క్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇథనాల్ కలిగిన ఇంధనంతో పనిచేసేలా ఇంజన్‌లో మార్పులు చేశారు. దీని కోసం ఇంజన్ కంట్రోల్ యూనిట్(ECU), ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్ (TCU), ఫ్యూయల్ సిస్టమ్‌లో మార్పులు చేసినట్లు కియా తెలిపింది. 100 శాతం ఇథనాల్‌తో పాటు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను కూడా ఈ కారులో ఉపయోగించవచ్చు. 6- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఈ కారులో అందిస్తున్నారు. ఇది సాధారణ టర్బో పెట్రోల్ వేరియంట్‌లో 7- స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్‌తో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది.
డిజైన్:
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సైరస్ కారు డిజైన్‌నే కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ సైరస్‌లో ఉపయోగించారు. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. బాక్సీ డిజైన్, LED లైటింగ్, రూఫ్ రైల్స్, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. L-ఆకారపు LED టెయిల్‌లైట్స్ కూడా కలిగి ఉంటుంది. ట్రిపుల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే, సెంటర్ కన్సోల్‌పై ఫిజికల్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

