Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల

  • కియా సైరోస్ EV భారత్ లో విడుదల
  • 526KM రేంజ్
  • అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు
Kia Syros Ev

Kia Syros Ev

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కియా ఇండియా కొత్త Kia Syros EVను అధికారికంగా విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వచ్చిన రెండో మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే రూ.25,000తో ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ఈ ఎలక్ట్రిక్ SUVని బుక్ చేసుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, శక్తివంతమైన పనితీరు, ప్రీమియం ఇంటీరియర్, లెవెల్-2 ADAS వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో Kia Syros EV వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు.

562 కి.మీ రేంజ్

Kia Syros EV రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులోకి వచ్చింది.

51.4kWh బ్యాటరీ – ఒకే పూర్తి ఛార్జ్‌పై 562 కి.మీ (ARAI) రేంజ్
42kWh బ్యాటరీ – ఒకే ఛార్జ్‌పై 443 కి.మీ (ARAI) రేంజ్

100kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండేందుకు బ్యాటరీ కండిషనింగ్ టెక్నాలజీను కూడా అందించారు. అదనంగా 10.8kW ఆన్‌బోర్డ్ AC ఛార్జింగ్, K-Charge ఎకోసిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రూట్ ప్లానర్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

శక్తివంతమైన పనితీరు

ఈ ఎలక్ట్రిక్ SUVలో ఉన్న అధునాతన నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (NMC) బ్యాటరీ గరిష్టంగా 171 PS పవర్ ఉత్పత్తి చేస్తుంది. 51.4kWh బ్యాటరీ వేరియంట్‌లో కారు కేవలం 8.1 సెకన్లలో 0 నుంచి 100 km/h వేగాన్ని అందుకుంటుంది. అలాగే IP67 సర్టిఫైడ్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ను అందించడం వల్ల వేడి పరిస్థితుల్లో కూడా మెరుగైన పనితీరు లభిస్తుంది.

అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు

Kia Syros EVలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ప్యాడిల్ షిఫ్టర్లతో రీజనరేటివ్ బ్రేకింగ్, ఆటో మోడ్, i-Pedal డ్రైవింగ్, Vehicle-to-Load (V2L) సపోర్ట్, బ్యాటరీ హీటింగ్ సిస్టమ్, డిజిటల్ కీ, వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్, Shift-by-Wire గేర్ సెలెక్టర్, ఎక్స్‌టీరియర్‌లో Ice Cube MFR LED హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ LED DRLs, LED ఫాగ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు కారుకు ఆధునిక లుక్‌ను అందిస్తున్నాయి.

ప్రీమియం ఇంటీరియర్

Kia Syros EV క్యాబిన్‌లో ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో, 12.3 అంగుళాల HD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
12.3 అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే ఉన్నాయి. అదనంగా, Kia Connect 2.0 (95+ కనెక్టెడ్ ఫీచర్లు) ,OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, వైర్‌లెస్ Android Auto, వైర్‌లెస్ Apple CarPlay, Harman Kardon 8-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

లెవెల్-2 ADASతో అత్యున్నత భద్రత

భద్రత విషయంలో కూడా Kia Syros EV ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో Level-2 ADAS టెక్నాలజీతో మొత్తం 16 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్. ఈ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి.

Kia Syros EV ప్రత్యేకత ఏమిటి?

ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక డిజిటల్ క్యాబిన్, కనెక్టెడ్ టెక్నాలజీ, ప్రీమియం ఆడియో సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లతో Kia Syros EV భారత ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలవనుంది. ఎక్కువ రేంజ్‌తో పాటు ప్రీమియం ఫీచర్లు కోరుకునే కొనుగోలుదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది.