Site icon NTV Telugu

హైటెక్ ఫీచర్లతో K4 Hatchbackను విడుదల చేసిన KIA..

Kia

Kia

Kia K4 Hatchback: కియా మోటార్స్ మరోసారి ఆటో మార్కెట్‌ను షాక్ కి గురి చేసింది. అద్భుతమైన డిజైన్‌, సరసమైన ధర, ఆధునిక ఫీచర్లతో 2026 Kia K4 Hatchbackను గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కియా K4 హ్యాచ్‌బ్యాక్‌ భారత్‌కు వస్తుందా? అనే అనుమానం భారత కార్ వినియోగదారుల్లో మొదలైంది.

Read Also: Hyderabad: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి.. భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి

కియా వ్యూహంలో కీలక మార్పు
* గతంలో అమెరికా లాంటి మార్కెట్లలో కియా ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను నిలిపివేసింది. ముఖ్యంగా మూడో తరం ఫోర్టే మోడల్‌లో హ్యాచ్‌బ్యాక్ బాడీ స్టైల్‌ను పూర్తిగా తొలగించింది. అయితే, ఇప్పుడు K4 Hatchback ద్వారా మళ్లీ ఆ విభాగంలోకి తిరిగి అడుగు పెట్టింది. ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ స్థలం, మెరుగైన వాల్యూ ఫర్ మనీని అందించాలనే లక్ష్యాన్ని కియా పెట్టుకుంది.

Read Also: Stock Market: మార్కెట్‌కు కొత్త జోష్.. భారీ లాభాల్లో సూచీలు

వేరియంట్లు, ధరలు
* అంతర్జాతీయ మార్కెట్లలో Kia K4 Hatchback మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Kia K4 Hatchback EX
Kia K4 Hatchback GT-Line
Kia K4 Hatchback GT-Line Turbo

ఇక, ఈ కార్ ప్రారంభ ధర $26,085గా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 23.36 లక్షల వరకు ఉంటుంది. GT-Line వేరియంట్ ధర $27,085 కాగా, టాప్ మోడల్ GT-Line Turbo ధర $29,985గా ఉంది. సెడాన్ వెర్షన్‌తో పోలిస్తే ధరలో పెద్ద తేడా లేకపోవడం గమనార్హం.

ఇంజిన్‌, పనితీరు
* Kia K4 Hatchback EX వేరియంట్‌లో 2.0 లీటర్ న్యాచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 147 హార్స్‌ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రోజువారీ వినియోగానికి సౌకర్యవంతంగా డ్రైవింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

* GT-Line అండ్ GT-Line Turbo వేరియంట్లలో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 హార్స్‌ పవర్ శక్తితో పాటు 195 పౌండ్-ఫీట్ టార్క్‌ను అందిస్తుంది. స్పోర్టీ సస్పెన్షన్ ట్యూనింగ్‌తో ఈ వేరియంట్లు మరింత డైనమిక్ డ్రైవింగ్ అనుభూతిని అందించనున్నాయి.

స్పేస్‌, వినియోగ సౌలభ్యం
* K4 Hatchback ప్రధాన బలం దీని ప్రాక్టికాలిటీ. వెనుక సీట్లు మడవకుండానే 22.2 క్యూబిక్ ఫీట్లు బూట్ స్పేస్ ను కియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సెడాన్‌లో లభించే 14.5 క్యూబిక్ ఫీట్ల కంటే ఎక్కువ అని చెప్పాలి. కాంపాక్ట్ SUVల కంటే కొంచెం చిన్నదైనా, సైజ్‌–వినియోగ సౌలభ్యం మధ్య మంచి సమతుల్యతను అందిస్తుంది.

టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు
ఈ హ్యాచ్‌బ్యాక్‌లో ఆధునిక టెక్నాలజీకి పెద్దపీట వేసింది కియా..
* వైర్లెస్ Apple CarPlay, Android Auto
* హీటెడ్ ఫ్రంట్ సీట్లు
* వైర్లెస్ ఫోన్ ఛార్జర్
* ఓవర్ ది ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్

భద్రత పరంగా ఇందులో 16 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌కు వచ్చే అవకాశాలు
* ప్రస్తుతం Kia India నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, భారత మార్కెట్‌కు అనుగుణంగా ధరలు, ఇంజిన్ ఆప్షన్లతో తీసుకొస్తే, Kia K4 Hatchback ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కాంపాక్ట్ SUVలకు ప్రత్యామ్నాయంగా స్టైలిష్‌, ఫీచర్ రిచ్ కార్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే, పెరుగుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుంటే 2026లో కియా ఈ గ్లోబల్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version