అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JSW Combat SUV Launch: భారత ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి మరో కొత్త SUV రాబోతోంది. JSW గ్రూప్‌కు చెందిన JSW మోటార్స్ తన కొత్త SUV ‘కంబాట్’ (Combat) తొలి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 3, 2026న ఈ వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌తో పాటు, అడ్వర్టైజింగ్ షూటింగ్ సమయంలో తీసిన స్పై ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. వీటి ద్వారా SUV ముందు, వెనుక డిజైన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి.
SUV డిజైన్..
కంపెనీ విడుదల చేసిన టీజర్లో ఆరెంజ్ బ్యాక్‌గ్రౌండ్‌పై కంబాట్ SUV ముందు భాగాన్ని చూపించింది. ‘A moment that moves Bharat’ అనే క్యాప్షన్‌తో ఈ టీజర్‌ను విడుదల చేసింది. గతంలో టెస్టింగ్ సమయంలో కనిపించిన మోడళ్లకు భిన్నంగా, ఇందులో కారు అసలు డిజైన్‌ను స్పష్టంగా చూపించారు. ఫ్రంట్ గ్రిల్‌పై పెద్ద అక్షరాలతో కంబాట్ (COMBAT) పేరు కనిపిస్తోంది. రెండు వైపులా స్క్వేర్డ్ హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌లు, వరుసగా అమర్చిన లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్లాట్ బానెట్, నిటారుగా ఉండే విండ్‌షీల్డ్, పెద్ద ORVMలు SUVకి బాక్సీ లుక్‌ను అందిస్తున్నాయి. భారీ ఫ్రంట్ బంపర్, ప్రత్యేకమైన లోయర్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు దీని రఫ్ అండ్ టఫ్ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.
Also Read
- Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
- Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
- New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
- TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
తాజాగా బయటకు వచ్చిన స్పై ఫొటోల్లో లేత నీలం, ఆకుపచ్చ రంగుల మిశ్రమ షేడ్‌లో ఉన్న కంబాట్ SUV వెనుక భాగం స్పష్టంగా కనిపిస్తోంది. టెయిల్‌గేట్ ఎడమవైపు JSW బ్రాండింగ్, వెనుక అమర్చిన స్పేర్ వీల్ కవర్‌పై కంబాట్ పేరు ఉన్నాయి. స్పేర్ వీల్ కవర్ మధ్యలో ప్రత్యేకమైన ఎంబ్లమ్‌ను అందించారు. రెండు వైపులా నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్, భారీ బ్లాక్ క్లాడింగ్‌తో కూడిన రియర్ బంపర్ ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు రూఫ్ రైల్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్, సైడ్ స్టెప్స్, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్
JSW కంబాట్ SUVలో జెటూర్ T2 ఆధారంగా రూపొందించిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) పవర్‌ట్రెయిన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 18.4kWh బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిపి అందించనున్నట్లు సమాచారం. ఈ సెటప్ ద్వారా గరిష్ఠంగా 360bhp పవర్, 610Nm టార్క్ ఉత్పత్తి కావచ్చని అంచనా. విదేశీ వెర్షన్లో ఈ పవర్‌ట్రెయిన్ మూడు స్పీడ్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు చక్రాలకు శక్తిని అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ రెండింటినీ ఉపయోగించినప్పుడు మొత్తం రేంజ్ సుమారు 1,100 కిలోమీటర్లుగా ఉండవచ్చని అంచనా. అయితే భారత్‌లో విడుదలయ్యే మోడల్ పవర్, బ్యాటరీ సామర్థ్యం, ధ్రువీకరించిన రేంజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్ వస్తుందా లేదా అనేది కూడా స్పష్టత లేదు.
లెవల్-2 ADAS
ఈ SUV డ్యాష్‌బోర్డ్ డిజైన్ జెటూర్ T2 మోడల్‌ను పోలి ఉండనుంది. ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు పవర్డ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్, సరౌండ్ వ్యూ కెమెరా, లెవల్-2 ADAS వంటి అధునాతన ఫీచర్లు అందించవచ్చని అంచనా. అయితే అధికారిక ఫీచర్ల జాబితా లాంచ్ సమయంలో వెల్లడికానుంది.
ధర
కొలతల పరంగా ఈ SUV సుమారు 4.8 మీటర్ల పొడవుతో ఉండనుంది. ఇందులో ఐదుగురు ప్రయాణించేలా విశాలమైన క్యాబిన్‌తో పాటు ఎక్కువ లగేజ్ స్పేస్ కూడా లభించే అవకాశం ఉంది. ధర, వేరియంట్లు, బుకింగ్స్, డెలివరీ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం JSW కంబాట్ SUV ధర రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. డిసెంబర్ 3న జరగనున్న అధికారిక లాంచ్ ఈవెంట్ లో ఈ SUVకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
-
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
-
Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
-
Hanu-Man : రెండు ముక్కలైన ‘హను-మాన్’ ఫ్రాంచైజీ.. ఒకే సినిమాకు రెండు వేర్వేరు సీక్వెల్స్!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..