Jawa 730 Twin Revealed: 75 HP పవర్‌తో జావా కొత్త లుక్ అదిరింది.. 730cc ఇంజిన్, బ్రెంబో బ్రేక్స్‌తో ‘మోడ్రన్ రెట్రో’ బైక్..

  • 730cc ఇంజిన్‌తో 75 HP పవర్
  • రెట్రో లుక్‌తో మోడ్రన్ టెక్నాలజీ
  • Brembo బ్రేక్స్ , ప్రీమియం సస్పెన్షన్
  • భారత్ లాంచ్‌పై అనిశ్చితి
Jawa 730 Twin

Jawa 730 Twin

Jawa 730 Twin Revealed: క్లాసిక్ మోటార్‌సైకిళ్ల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావా, గ్లోబల్ మార్కెట్ లక్ష్యంగా సరికొత్త ‘నియో-రెట్రో’ మిడిల్‌వెయిట్ బైక్ Jawa 730 Twinను ఆవిష్కరించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ‘జావా మోటో’ (Jawa Moto) సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. కేవలం లుక్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్‌లోనూ ఈ బైక్ అదిరిపోయేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. 2026 ప్రారంభంలో నిర్వహించిన ఈ లాంచ్, అంతర్జాతీయ బైక్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అదిరిపోయే ఇంజిన్ , పవర్
ఈ బైక్‌లోని ప్రధాన ఆకర్షణ దీని ఇంజిన్. స్విస్ ఇంజనీరింగ్ దిగ్గజం Suter Racing Technology సహకారంతో ఈ 730cc లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం గంభీరమైన శబ్దాన్ని ఇవ్వడమే కాకుండా, రోడ్డుపై చిరుతలా దూసుకెళ్తుంది. గరిష్టంగా 75 HP పవర్‌ను , 68 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఈ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. గంటకు సుమారు 205 కిమీ గరిష్ట వేగంతో వెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఐరోపాలో కొత్త రైడర్ల కోసం దీనిని 47 HP పవర్‌కు తగ్గించి ‘A2-compliant’ వేరియంట్‌గా కూడా అందించనున్నారు.

రెట్రో స్టైలింగ్ – మోడ్రన్ టెక్నాలజీ
పాత కాలపు జావా బైక్‌లను గుర్తుకు తెచ్చేలా గుండ్రటి హెడ్‌ల్యాంప్ , క్లాసిక్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌ను దీనికి ఇచ్చారు. అయితే, లోపల మాత్రం పూర్తి ఆధునిక సాంకేతికతను జోడించారు. ఈ బైక్ కేవలం చూడటానికే కాదు, నడపడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నావిగేషన్ , బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన ఆధునిక TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండటం వల్ల కాల్ , ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్ నేరుగా డిస్‌ప్లేపై చూడవచ్చు. ఎల్‌ఈడీ లైటింగ్ , స్పోర్టీ సింగిల్ సీట్ సెటప్ ఈ బైక్‌కు ఒక ప్రత్యేకమైన ‘కెఫే రేసర్’ లుక్‌ను ఇస్తున్నాయి.

ప్రీమియం హార్డ్‌వేర్ , భద్రత
భద్రత , రైడ్ క్వాలిటీ విషయంలో జావా ఎక్కడా రాజీ పడలేదు. ముందు వైపు Brembo కాలిపర్స్ కలిగిన ట్విన్ డిస్క్ బ్రేక్స్ , Bosch డ్యూయల్ ఛానల్ ABS అత్యుత్తమ బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి. సస్పెన్షన్ కోసం ప్రముఖ బ్రాండ్ KYB నుండి అప్-సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్ , వెనుక అడ్జస్టబుల్ మోనోషాక్ సదుపాయం ఉన్నాయి. 17-ఇంచ్ అలాయ్ వీల్స్ , 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో ఈ బైక్ లాంగ్ రైడ్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. 213 కిలోల బరువుతో రోడ్డుపై మంచి గ్రిప్‌ను ఇస్తుంది.

ఇండియాలో లాంచ్ అవుతుందా?
ప్రస్తుతానికి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ Jawa 730 Twinను అభివృద్ధి చేసింది చెక్ రిపబ్లిక్‌కు చెందిన ‘జావా మోటో’. ఇండియాలో జావా బైక్‌లను విక్రయిస్తున్న ‘క్లాసిక్ లెజెండ్స్’ (మహీంద్రా అనుబంధ సంస్థ) కి దీనితో నేరుగా సంబంధం లేదు. ఇండియాలో ఇప్పటికే 350cc పైబడిన బైక్‌లపై పన్నుల భారం పెరగడంతో, ఈ పవర్‌ఫుల్ 730cc బైక్ భారత్‌లోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఇతర మోడళ్లను భారత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసి తెచ్చే అవకాశం ఉంది.

Vellampalli Srinivas: లడ్డూలో ఫ్యాట్ ఉందని నిరూపిస్తారా.. కూటమి నేతలకు వెల్లంపల్లి ఛాలెంజ్..