Site icon NTV Telugu

ఇండియా తొలి ‘గియర్డ్ ఎలక్ట్రిక్ బైక్’ MATTER AERA 5000+ లాంచ్.. ధర ఎంతంటే..?

Matter Aera 5000+

Matter Aera 5000+

MATTER AERA 5000+: భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ MATTER Motor Works తమ ఫ్లాగ్‌షిప్ గియర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ AERA 5000+ ను చెన్నైలో ఘనంగా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంతో పాటు తమిళనాడులో తొలి MATTER Experience Hub కూడా ప్రారంభించారు. ముఖ్యంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఇండియాలోని తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడంతో AERA 5000+ పై బైక్ ప్రేమికులు భారీ ఆసక్తి చూపుతున్నారు. భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 100% దేశంలోనే రూపకల్పన చేసిన ఈ బైక్‌లో MATTER ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన HyperShift 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను అందించింది. ఈ గేర్‌బాక్స్ ఈవీలకు సాధారణంగా లభించే సైలెంట్ టార్క్, స్మూత్ పవర్ డెలివరీకి మాన్యువల్ షిఫ్ట్ చేసే అనుభూతిని జోడిస్తుంది. అలాగే ఈ బైక్‌ లోని లిక్విడ్ కూల్డ్ పవర్‌ ట్రెయిన్ చెన్నై వంటి వేడి వాతావరణ ప్రాంతాల్లో కూడా స్థిరమైన పనితీరును అందిస్తుంది.

IND vs SA: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఆలౌట్..!

AERA 5000+ లో హైపర్ షిఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. 5 kWh బ్యాటరీతో 172 కి.మీ. IDC రేంజ్‌ను అందిస్తుంది. 7 అంగుళాల స్మార్ట్ టచ్‌ స్క్రీన్ డాష్‌బోర్డ్ నావిగేషన్, మ్యూజిక్, రైడ్ డేటా, OTA అప్డేట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంది. స్మార్ట్ ఛార్జింగ్ సదుపాయంతో దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకునే వీలు ఉంది. సేఫ్టీ పరంగా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ABS, డ్యూయల్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను అందించారు. MatterVerse మొబైల్ యాప్ ద్వారా లైవ్ ట్రాకింగ్, రిమోట్ లాక్/అన్‌లాక్ సదుపాయాలు ఉన్నాయి. స్మార్ట్ కీతో కీ లెస్ స్టార్ట్ అందుబాటులో ఉంది. కిలోమీటరుకు కేవలం రూ.0.25 ఖర్చుతో మూడు సంవత్సరాల్లో ఒక లక్ష వరకు సేవింగ్స్ సాధ్యమని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా ఇండియాలో తొలిసారిగా లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ అందించడం ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలిపింది.

BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 పోస్టులు.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

బైక్ పవర్‌ట్రెయిన్ నుండి బ్యాటరీ, గేర్‌బాక్స్, సాఫ్ట్‌వేర్ వరకు ప్రతి అంశాన్ని MATTER సంస్థ స్వయంగా అభివృద్ధి చేయడం వల్ల నాణ్యతపై పూర్తి నియంత్రణ ఉందని కంపెనీ పేర్కొంది. పనితీరు పరంగా 105 km/h టాప్ స్పీడ్, 125 km రియల్ రేంజ్, 11.5 kW IPMSM మోటార్, 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వంటి అత్యాధునిక స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ABS బ్రేక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ రియర్ సస్పెన్షన్, 4G LTE, Wi-Fi, BLE, GPS, OTA Updates వంటి టెక్నాలజీ ఫీచర్లతో ఆధునిక రైడర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించారు. AERA 5000+ బుకింగ్స్ MATTER అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ బైక్ యొక్క ఇంట్రోడక్టరీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,93,826గా నిర్ణయించారు. కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, గ్లేసియర్ వైట్, బ్లెజ్ రెడ్, నోర్డ్ గ్రే వంటి ఐదు రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. చెన్నై పెరుంబక్కంలోని MATTER ఎక్స్పీరియన్స్ హబ్ ను సందర్శించి బైక్‌ను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది.

Exit mobile version