Site icon NTV Telugu

స్టైలిష్ లుక్, ADAS లెవెల్ 2 ఫీచర్‌, అబ్బురపరిచే ఫీచర్లతో లాంచ్కు సిద్దమైన Hyundai Venue N..!

Hyundai Venue N

Hyundai Venue N

Hyundai Venue N: రెండవ తరం వెన్యూ (Venue )ను పరిచయం చేసిన తర్వాత.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు మరింత పనితీరు అందించే ‘ఎన్ లైన్’ (N Line) వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. స్పోర్టి లుక్ లో కనిపించే ఈ ఎస్‌యూవీ నవంబర్ 4న భారతదేశంలో లాంచ్ కానుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ (GDi) ఇంజిన్ తో వస్తుంది. ఇది 120 హార్స్‌పవర్ (hp) శక్తిని, 172 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ ట్రెయిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) తో అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ వెర్షన్‌లో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉన్నాయి.

200MP+50MP+50MP+50MP కెమెరా, 5440mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 Pro లాంచ్..!

స్టాండర్డ్ వెన్యూతో పోలిస్తే.. వెన్యూ ఎన్ లైన్ అనేక డిజైన్ మార్పులను కలిగి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ముందు, వెనుక బంపర్‌లపై ఎరుపు రంగు యాక్సెంట్‌లు ప్రధానంగా కామపడుతాయి. ఇది 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ రిమ్స్, ఎరుపు బ్రేక్ కాలిపర్‌లు, వింగ్ స్టైల్ స్పాయిలర్, డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌తో వస్తుంది. వెన్యూ ఎన్ లైన్ అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, డ్రాగన్ రెడ్, అబిస్ బ్లాక్, హాజెల్ బ్లూ వంటి ఐదు సాలిడ్ రంగులలో నలుపు రూఫ్‌తో మూడు డ్యూయల్ టోన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇక క్యాబిన్ లోపల నలుపు రంగు అపోల్స్టరీని ఎరుపు హైలైట్స్ తో డిజైన్ చేశారు. ఇది స్పోర్టియర్ లుక్‌ను ఇస్తుంది. టెక్నాలజీ పరంగా ఎన్విడియా (NVIDIA) తో పనిచేసే 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ నావిగేషన్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ గేజ్ క్లస్టర్, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. అలాగే, ఈ వాహనంలో 20 వరకు వాహన కంట్రోలర్‌లను ప్రభావితం చేసే ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు పొందే సామర్థ్యం ఉంది. సరౌండ్ వ్యూ మానిటరింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్ మరియు సువాసన డిఫ్యూజర్ వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి.

JioHotstar: రూ. 1 కే జియో హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్.. ఈ స్పెషల్ ఆఫర్ మీకూ వచ్చిందా?

ఇక ముఖ్యంగా ప్రయాణీకుల భద్రతను పెంచడానికి వెన్యూ ఎన్ లైన్ ADAS లెవెల్ 2 ఫీచర్‌లతో వస్తుంది. ఇందులో 21 డ్రైవర్ అసిస్టెన్స్ ఫంక్షన్లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ ఉన్నాయి. ఈ వాహనంలో 70 కంటే ఎక్కువ అధునాతన భద్రతా ఫీచర్లతో పాటు 41 ప్రామాణిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. దీని బుకింగ్‌ లను కూడా ప్రారంభించింది.కాబట్టి ఆసక్తిగల కొనుగోలుదారులు డీలర్‌షిప్‌ల ద్వారా కేవలం రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Exit mobile version