చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హ్యుందాయ్ వెన్యూ ఫెస్ లిఫ్ట్ కార్ తాజాగా ఈ రోజు మార్కెట్ లోకి వచ్చింది. కార్ మార్కెట్లకు రాకముందే విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఏకంగా 15 వేలకు పైగా ప్రీబుకింగ్స్ అయ్యాయి. గతంలో వెన్యూతో పోలిస్తే ప్రస్తుతం అనేక మార్పులతో, లగ్జరీ, కంఫర్ట్ ఫీచర్లలో వెన్యూ ఫెస్ లిఫ్ట్ వెర్షన్ మార్కెట్ లోకి వస్తుంది.
మొత్తం ఆరు వేరియంట్లలో వెన్యూ లభిస్తోంది. ఈ, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ) వేరియంట్లతో వెన్యూ మార్కెట్ లోకి వచ్చింది. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.53 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ. 12.57 లక్షల వరకు ఉంది. డిజిల్ వేరియంట్ రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ 12.32 లక్షల వరకు ఉంది.
కొత్త వెన్యూలో క్యాబిన్ మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. స్లిమ్ అప్పర్ స్లైట్ క్లస్టర్, పారమెట్రిక్ జ్యువెల్ గ్రిల్, హెడ్ లైట్స్, డీఆర్ఎల్ కోసం స్ప్లిట్ సెటప్, ఆకర్షణీయంగా టెయిల్ ట్యాంప్స్ డిజైన్ చేశారు. దీంతో పాటు అల్లాయ్ వీల్స్ ను కొత్తగా డిజైన్ చేశారు. డాష్ బోర్డ్ డ్యుయల్ టోన్ లో మరింత అట్రాక్షన్ గా కనిపించబోతోంది. టాప్ వేరియంట్లలో అనలాగ్ క్లస్టర్ ను డిజిటల్ క్లస్టర్ గా మార్చారు.
హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ ద్వారా 60 కన్నా ఎక్కువ కార్ ఫీచర్లను , 10 ప్రాంతీయ భాషలతో పాటు 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. గుగూల్ , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను సపోర్ట్ చేస్తుంది. మోట్ క్లైమేట్ కంట్రోల్, డోర్ లాక్ అండ్ అన్‌లాక్, వెహికల్ స్టేటస్ చెక్, ఫైండ్ మై కార్, టైర్ ప్రెజర్ సమాచారం, ఫ్యూయల్ లెవెల్ సమాచారం, స్పీడ్ అలర్ట్, టైమ్ ఫెన్సింగ్ , ఐడిల్ టైమ్ అలర్ట్ ఫీచర్లను వాయిస్ అసిస్టెంట్ ద్వారా యాక్సెస్ చేసే వీలుంటుంది.
వెన్యూ తన స్టార్టింగ్ వెర్షన్ లో నుంచి ఎస్ఎక్స్ ఓ మినహా అన్ని వేరియంట్లలో 82 బీహెచ్పీ 1.2 లీటర్ 4 సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. టాప్ వేరియంట్ లో మాత్రం 118 బీహెచ్పీ 1.0 లీటర్ ట్రి సిలిండర్ ఇంజిన్ ను ఇచ్చారు. ఇక డిజిల్ వెర్షన్ లో 99 బీహెచ్పీ 1.5 లీటర్ ఇంజిన్, ఈ, ఎస్, ట్రిమ్ మినహా అన్ని వేరియంట్లలో ఉండనుంది. 1.2 పెట్రోల్ ఇంజిన్ లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ , 1.5 డిజిల్ లో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్,