Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే

  • Hyundai కార్లలో భారీ అప్‌డేట్
  • మూడు SUVలకు కొత్త Lounge Edition
Hyundai

Hyundai

Creta Electric Lounge Edition: భారత మార్కెట్లో SUVలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో Hyundai మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ ఒకేసారి తన మూడు ప్రముఖ SUVలకు Lounge Editionను పరిచయం చేసింది. ఇందులో Hyundai Creta, Hyundai Alcazar, Creta Electric ఉన్నాయి. కొత్త Lounge Editionలో ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక ఇంటీరియర్ డిజైన్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అదనపు సౌకర్యాలను అందించారు. ఈ మూడు SUVల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మూడు SUVలకు Lounge Edition

Hyundai తన Creta, Alcazar, Creta Electric మోడళ్లలో Lounge Editionను అందిస్తోంది. ముఖ్యంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి మరింత ప్రీమియం, ఎంటర్‌టైన్‌మెంట్ ఆధారిత అనుభవాన్ని అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఈ ఎడిషన్‌లో కొన్ని మోడళ్లకు ప్రత్యేక రంగులు, కొత్త సీటు డిజైన్, అంబియంట్ లైటింగ్, రియర్ స్క్రీన్ వంటి ఫీచర్లను జోడించారు.

Hyundai Creta Lounge Edition ఫీచర్లు

Creta Lounge Editionను King ట్రిమ్ ఆధారంగా రూపొందించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా 11.6 అంగుళాల రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా వెనుక సీటులో ఉన్న ప్రయాణికులు వీడియో స్ట్రీమింగ్, OTT కంటెంట్, గేమింగ్, ఫోన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు Bose 8-స్పీకర్, ఆడియో సిస్టమ్, ప్రత్యేక Lounge ఇంటీరియర్ థీమ్, ప్రీమియం సీట్ డిజైన్, అంబియంట్ లైటింగ్, 11.6-అంగుళాల రియర్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Creta Lounge Edition ఇంజిన్

Creta Lounge Editionలో 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్‌తో iVT ఆప్షన్, అలాగే 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తున్నారు.

Creta Lounge Edition ధర

ప్రారంభ ధర: రూ.19.21 లక్షలు
టాప్ వేరియంట్: రూ.20.45 లక్షలు
ధరలు: ఎక్స్-షోరూమ్

Hyundai Alcazar Lounge Edition

Alcazar Lounge Editionలో కూడా ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా పలు మార్పులు చేశారు. ఇందులో కొత్త Golden Bronze కలర్ ఆప్షన్‌ను అందించారు. అదనంగా స్కిడ్ ప్లేట్లు, సిల్ గార్నిష్‌పై బ్లాక్ ఫినిష్, రియర్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, ORVMలు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్‌లో ప్రత్యేక Lounge సీటింగ్ డిజైన్, వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, 11.6-అంగుళాల రియర్ సీట్ స్క్రీన్, అంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు అందించారు.

Alcazar ఇంజిన్

Alcazar Lounge Editionలో 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజిన్ ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తున్నారు.

Alcazar Lounge Edition ధర

రూ.21.80 లక్షల నుంచి రూ.21.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

Creta Electric Lounge Edition

Hyundai తన ఎలక్ట్రిక్ SUV Creta Electricకు కూడా Lounge Editionను తీసుకొచ్చింది. ఇది Long Range వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఈ వెర్షన్‌లో కొత్త Bronze కలర్ ఆప్షన్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్లు, బ్లాక్ సిల్ గార్నిష్, రియర్ స్పాయిలర్, రూఫ్ రైల్స్, ORVMలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా హోమ్ ఛార్జర్ ఆప్షన్, డ్యాష్‌క్యామ్, రియర్ వైర్‌లెస్ ఛార్జర్, 11.6-అంగుళాల రియర్ సీట్ స్క్రీన్, అంబియంట్ లైటింగ్ ప్రత్యేక Lounge సీట్ డిజైన్ వంటి ఫీచర్లు అందించారు.

Creta Electric Lounge Edition ధర

Creta Electric Lounge Edition ఎక్స్-షోరూమ్ ధర:

రూ.24.34 లక్షల నుంచి రూ.25.22 లక్షల వరకు.