హ్యుందాయ్ త్వరలో క్రెటా ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ను శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా.. చాలా కాలంగా అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. కాంపాక్ట్ SUV విభాగంలో అత్యధికంగా అమ్మకాలు జరపడం అంత సులభం కాదు.. ఎందుకంటే మార్కెట్లో ఇతర కంపెనీల SUVలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రథమ స్థానంలో ఉండేందుకు.. హ్యుందాయ్ కొత్త ఆవిష్కరణలను జరుపుతోంది. హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్‌ను పండుగ సీజన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ SUV హోమోలోగేషన్ పత్రాలు ప్రారంభ తేదీకి ముందే లీక్ అయ్యాయి. అందులో ఈ SUV పేరు కూడా ఉంది. భవిష్యత్తులో దీనిని క్రెటా SE (స్పెషల్ ఎడిషన్) అని కూడా పిలవవచ్చు. హ్యుందాయ్ దీనిని త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. పండుగ సీజన్లో అమ్మకాలను పెంచుకోవడానికి, సాధారణ మోడల్ నుండి వేరు చేయడానికి క్రెటా SE కొన్ని విభిన్న డిజైన్‌తో ముందుకు రానుంది.
Constable Jobs: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ కొత్త నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా
హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్:
హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారు. అదనంగా, పండుగ సీజన్‌లో కొత్తదాన్ని పరిచయం చేయడం కోసం కొనుగోలుదారులకు సానుకూల సెంటిమెంట్‌ను సృష్టిస్తుంది. కొత్త క్రెటాతో పాటు, హ్యుందాయ్ టెక్నాలజీతో కూడిన SE వేరియంట్‌ను పరిచయం చేయబోతోంది. హ్యుందాయ్ క్రెటా SE హోమోలోగేట్ చేయబడింది. త్వరలోనే షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. SE అనేది ప్రత్యేక ఎడిషన్ లేదా స్పోర్ట్స్ ఎడిషన్‌ని సూచిస్తుంది. హ్యుందాయ్ క్రెటా SEని S(O), SX(O) ట్రిమ్ స్థాయిలతో మాత్రమే హోమోలాగేట్ చేసింది.
క్రెటా SEని ఎంచుకోవడానికి నాలుగు పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉన్నాయి. వీటిలో 1.5L NA పెట్రోల్ MT, 1.5L NA పెట్రోల్ IVT, 1.5L టర్బో డీజిల్ MT, 1.5L టర్బో డీజిల్ AT ఉన్నాయి. క్రెటా SE 1.5L టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందించబడదని తెలుస్తోంది. ఇందులో.. 1.5L NA పెట్రోల్ 113 bhp శక్తిని, 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 1.5లీటర్ డీజిల్ ఇంజన్ 113బిహెచ్‌పి పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. హ్యుందాయ్ క్రెటా SE భారతీయ మార్కెట్లో గ్రాండ్ విటారా, హేరైడర్, సెల్టోస్, ఎలివేట్, ఆస్టర్, కర్వ్, ఇతర SUVలతో పోటీపడుతుంది. ఇంతకుముందు హ్యుందాయ్ క్రెటాతో పోలిస్తే.. కొత్త క్రెటాలో కొన్ని యాడ్-ఆన్‌లను ఆశించవచ్చు. కొత్త ఇంటీరియర్ థీమ్, ఎక్స్‌టీరియర్ డెకాల్, డాష్ కెమెరా, కొన్ని హైలైట్ ఎలిమెంట్‌లను ఇందులో చూడవచ్చు. పవర్‌ట్రెయిన్ మునుపటిలానే ఉంటుంది.