NTV Telugu Site icon

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ లాంచ్ తేదీ ప్రకటన.. ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ!

Hyundaicretaev

Hyundaicretaev

హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ విడుదల తేదీని ప్రకటించింది. కార్‌వాలే (CarWale) నివేదిక ప్రకారం.. 17 జనవరి 2025న జరగబోయే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ వాహనాన్ని ప్రదర్శించనున్నారు. క్రెటా ఈవీ భారతదేశంలో హ్యుందాయ్ బ్రాండ్ యొక్క మూడవ ఎలక్ట్రిక్ వాహనం. పవర్, రేంజ్‌లో కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం..

డిజైన్‌లో కొత్త మార్పులు..
క్రెటా ఈవీని ఇటీవల ప్రారంభించిన ఫేస్‌లిఫ్టెడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుంది. అయితే.. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి కొన్ని ప్రత్యేక మార్పులు చేయనున్నారు. కానీ క్రెటా ఎన్-లైన్ మాదిరిగానే ఈ మోడల్ కు దాని స్వంత గుర్తింపును ఇచ్చే విభిన్న స్టైలింగ్ ఉంటుంది. కొత్త స్టైలింగ్‌తో ముందు, వెనుక బంపర్‌లను ఇందు మార్చవచ్చు. ఒక క్లోజ్డ్ గ్రిల్ (బ్లాంక్డ్-అవుట్ గ్రిల్), కొత్త అల్లాయ్ వీల్స్ అమర్చుతారు. వీటిలో ఏరో ఇన్సర్ట్‌లు ఉండనున్నాయి. లగ్జరీ ఇంటీరియర్స్, హైటెక్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

ఫీచర్‌లు ఇవే..
కొత్త 3-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ 10.25-అంగుళాల డిజిటల్ స్క్రీన్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కప్ హోల్డర్‌లతో కూడిన కొత్త సెంటర్ కన్సోల్ డిజైన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అనేక ప్రీమియం, అధునాతన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ నుండి తీసుకున్న కొత్త ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్ ను కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఆటో-హోల్డ్ ఫంక్షన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 360-డిగ్రీ కెమెరా, కొత్త రోటరీ డయల్ వంటి ఈపీబీ ఫీచర్‌లను చూడవచ్చు.

60kWh బ్యాటరీ ప్యాక్..
హ్యుందాయ్ క్రెటా ఈవీ 60kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీన్ని ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజ్ ఇస్తుందని నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ మార్కెట్లో బలమైన ఎంపికగా పరిగణించబడుతుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ.. MG ZS EV, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6, BYD అటో 3, రాబోయే మారుతి ఇ-విటారాతో నేరుగా పోటీపడుతుంది.

Show comments