Mahindra XUV 7XO: మహీంద్రా తన ప్రీమియం ఎస్‌యూవీకి రిఫ్రెష్‌డ్ వెర్షన్‌గా కొత్త XUV 7XOను భారత్‌లో 2026 జనవరి 5న ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు XUV700గా ఉన్న ఈ మోడల్‌కు కొత్త పేరు, అప్‌డేటెడ్ డిజైన్, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్‌లోకి తీసుకు రాబోతుంది. ఇప్పటికే ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో బుక్ చేసుకోవచ్చు. లాంచ్ అనంతరం త్వరలోనే డెలివరీలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. XUV 3XO తరహాలోనే కొత్త నేమింగ్ కన్వెన్షన్‌లో భాగంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మహీంద్రా తెలిపింది.
Read Also: Srisailam: మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
ఇక, డిజైన్ పరంగా చూస్తే, మహేంద్రా XUV 7XOలో ఫ్రంట్ ఫేషియాలో కొత్త LED హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన గ్రిల్, బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్‌తో మరింత మోడ్రన్ లుక్ అందిస్తుంది. అయితే, ఓల్డ్ XUV700 సిల్హౌట్‌ను పూర్తిగా మార్చకుండా ఎవల్యూషనరీ డిజైన్‌ను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్, టెక్నాలజీ విషయంలో ఇది పెద్ద అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ వైపు ప్రత్యేక స్క్రీన్‌తో పాటు రియర్ సీటులో కూర్చున్నవారు ముందు కో-డ్రైవర్ సీటును నియంత్రించగలిగే ‘బాస్ మోడ్’ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
Read Also: Phone Tapping Case: ముగిసిన ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ.. ఏం తేలిందంటే..?
అయితే, ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మహేంద్రా XUV 7XOలో కొనసాగనున్నాయి. కీలక వేరియంట్లలో సుమారు 185 హెచ్‌పీ పవర్, 450Nm టార్క్ ఉండే అవకాశం ఉంది. ఎంపిక చేసిన మోడళ్లలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం కూడా లభించనుంది. ఫీచర్లు, కంఫర్ట్ పరంగా ఫ్రంట్, రియర్ వెంటిలేటెడ్ సీట్లు, పానోరామిక్ సన్‌రూఫ్, ADAS సేఫ్టీ ఫీచర్లు, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో XUV 7XOను 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందించే ఛాన్స్ ఉంది. అలాగే, స్టైల్, టెక్నాలజీ, కంఫర్ట్ పరంగా ఈ SUV సెగ్మెంట్‌లో మహీంద్రా మరింత స్ట్రాంట్ పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
Goosebumps. Hello, again. Pre-bookings open now.
Creative visualisation. For representation purposes only. pic.twitter.com/y51a4GoTOb
— Mahindra XUV 7XO (@Mahindra_XUV7XO) December 15, 2025
