Honda ZR-V: హోండా ZR-V భారత్‌లో లాంచ్.. 7.9 సెకన్లలో 100 km/h స్పీడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రీమియం SUV
- హోండా ZR-V భారత్‌లో లాంచ్
- ఎక్స్-షోరూమ్ ధర రూ.47.99 లక్షలు
- సేఫ్టీ ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్‌తో Honda ZR-V ప్రీమియం SUV
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో అత్యంత ప్రీమియం SUV అయిన Honda ZR-Vను అధికారికంగా విడుదల చేసింది. పూర్తిగా విదేశాల్లో తయారైన CBU (Completely Built Unit) మోడల్‌గా వచ్చిన ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.47.99 లక్షలు. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన హోండా కారు ఇదే. స్టైలిష్ డిజైన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, అధునాతన సేఫ్టీ ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్‌తో Honda ZR-V ప్రీమియం SUV సెగ్మెంట్లో కొత్త పోటీని సృష్టించనుంది.
ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్
Honda ZR-V సాంప్రదాయ SUVల మాదిరిగా బాక్సీ డిజైన్‌లో కాకుండా, స్పోర్టీ క్రాస్ఓవర్ స్టైల్లో రూపొందించారు. ముందు భాగంలో స్టైలిష్ గ్రిల్, ఫుల్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, పెద్ద ఎయిర్ ఇన్టేక్స్, ఏరోడైనమిక్ బంపర్ డిజైన్, పక్క భాగంలో పొడవైన వీల్‌బేస్, స్లోపింగ్ రూఫ్‌లైన్, 18-అంగుళాల డైమండ్ కట్, అలాయ్ వీల్స్, బాడీ కలర్ క్లాడింగ్, వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్లు, గన్మెటల్ స్కిడ్ ప్లేట్.
Also Read
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
అందుబాటులో ఉన్న రంగులు
Honda ZR-V మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది.
క్రిస్టల్ బ్లాక్ పెర్ల్
మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్
ప్లాటినం వైట్ పెర్ల్
ట్వైలైట్ మిస్ట్ బ్లాక్ పెర్ల్
ప్రీమియం ఇంటీరియర్
క్యాబిన్ పూర్తిగా ప్రీమియం ఫీలింగ్‌ను అందించేలా రూపొందించారు. ప్రధాన హైలైట్స్ ఆల్ బ్లాక్ థీమ్, లెదరెట్ సీట్లు, సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్, కాంట్రాస్ట్ స్టిచింగ్, మెటాలిక్ ఫినిష్, డ్రైవర్ ఫోకస్డ్ లేఅవుట్, డ్రైవర్ సీటుకు 8-వే పవర్ అడ్జస్ట్, మెమరీ ఫంక్షన్ ముందు ప్రయాణికుడికి 4-వే పవర్ అడ్జస్ట్, వెనుక సీట్లలో కూడా మంచి లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది. భారీ బూట్ స్పేస్.. సాధారణ బూట్ స్పేస్ 380 లీటర్లు, వెనుక సీట్లు మడిస్తే.. 1,313 లీటర్లు దీంతో ఫ్యామిలీ జర్నీకి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఫీచర్లు
Honda ZR-Vలో అనేక ప్రీమియం ఫీచర్లు అందించారు.
9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్
Wireless Apple CarPlay
Wireless Android Auto
10.2-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే
12 స్పీకర్ల Bose ప్రీమియం సౌండ్ సిస్టమ్
Wireless ఫోన్ ఛార్జర్
Dual Zone ఆటోమేటిక్ AC
Ambient Lighting
Gesture Control Power Tailgate
Keyless Entry
Tilt & Telescopic Steering
Rear AC Vents
భద్రతలోనూ టాప్ క్లాస్
Honda ZR-Vలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రధాన సేఫ్టీ ఫీచర్లు:
8 ఎయిర్‌బ్యాగ్స్
Level-2 ADAS
360-డిగ్రీ కెమెరా
ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు
నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు
Electronic Stability Control
Traction Control
Hill Start Assist
Hill Descent Control
Electronic Parking Brake
Auto Hold
ISOFIX Child Seat Mounts
శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్
Honda ZR-Vలో 2.0-లీటర్ e Strong Hybrid పవర్‌ట్రెయిన్ అందించారు. ఇందులో 2.0L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, రెండూ కలిసి ఉత్పత్తి చేసే శక్తి 181 bhp పవర్, 315 Nm టార్క్, కేవలం 7.9 సెకన్లలో 100 km/h. ఈ SUV 0-100 km/h వేగాన్ని కేవలం 7.9 సెకన్లలో చేరుకుంటుంది. అంతేకాకుండా హోండా ప్రకారం మైలేజ్: 22.80 kmpl. స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల పవర్‌తో పాటు ఇంధన ఆదా కూడా లభిస్తుంది.
ధర
భారతదేశంలో Honda ZR-V ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.99 లక్షలు. CBU మోడల్‌గా దిగుమతి కావడంతో ఇది ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన Honda కారుగా నిలిచింది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!