Honda WN7: హోండా తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ WN7ను యూరప్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే దీని పేరుకు ఓ స్టోరీనే ఉందండోయ్.. ఈ బైక్‌కు మొదట “EV FUN కాన్సెప్ట్” అని పేరు పెట్టగా.. ఇప్పుడు దీనిని WN7 అని పిలుస్తున్నారు. దీని పేరులోని ‘W’ అంటే Wind (గాలి), ‘N’ అంటే Naked (నగ్న), ‘7’ అనేది ఇది పోటీ పడే పవర్ క్లాస్‌ను సూచిస్తుంది. ఇది హోండా పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల లైనప్‌లో మొదటి మోడల్. కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే కంపెనీ లక్ష్యానికి ఈ మోడల్ ముఖ్యమైన అడుగు. ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీ డిజైన్ కలిగి ఉంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఐరోపాలో 12,999 పౌండ్లు అంటే దాదాపు రూ. 15.55 లక్షలు ధరతో విడుదల చేశారు.
7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేతో Oppo K13s వచ్చేసిందోచ్!
ఈ బైక్ 600cc ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) మోటార్‌సైకిల్‌కు సమానమైన పనితీరును అందిస్తుందని హోండా తెలిపింది. అయితే, దీని టార్క్ అవుట్‌పుట్ 1000cc ICE మోటార్‌సైకిళ్లకు పోటీగా ఉంటుందని సమాచారం. ఈ బైక్ 18kW వాటర్ కూల్డ్ మోటార్, 100Nm టార్క్ తో వస్తుంది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో ఒకే ఛార్జ్‌పై 130 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ బైక్‌లో CCS2 రాపిడ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే, హోమ్ ఛార్జర్ ఉపయోగించి 3 గంటల కంటే తక్కువ సమయంలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
7,000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో అమ్మకాల సునామి సృష్టించడానికి సిద్దమైన Moto G36!
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, హోండా RoadSync స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది. ఇంకా DCT సిస్టమ్ (+), (-) బటన్లతో ఉన్న బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇంకా క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇది 217 కిలోల బరువు ఉంది. ప్రస్తుతం ఈ బైక్ యూరప్ మార్కెట్‌కు మాత్రమే లాంచ్ అయ్యింది. భారతదేశంలో దీని విడుదలపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
