Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda Shine Sales: భారత మార్కెట్లో ఎన్నో బైక్‌లు వస్తూనే ఉంటాయి.. కొన్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.. రికార్డు స్థాయిలో సేల్స్ నమోదు చేస్తాయి.. ఇప్పుడు, దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా షైన్ మరోసారి తన సత్తా చాటింది. హోండా టూ-వీలర్ ఇండియాకు 2026 ఆగస్టు నెలలో మంచి అమ్మకాలు నమోదయ్యాయి. కంపెనీ మొత్తం 5,17,331 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 2025 ఆగస్టుతో పోలిస్తే అమ్మకాలు 7.54 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 36,273 యూనిట్ల అదనపు విక్రయాలు నమోదయ్యాయి. 2026 జూలైలో నమోదైన 4,76,436 యూనిట్లతో పోలిస్తే ఆగస్టులో అమ్మకాలు 8.58 శాతం పెరిగాయి. హోండా పోర్ట్‌ఫోలియోలో యాక్టివా అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్ కాగా, మోటార్ సైకిళ్ల విభాగంలో షైన్ అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌గా కొనసాగుతోంది. భారత మార్కెట్లో హీరో స్పెండర్ తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే బైక్‌లలో హోండా షైన్ రెండో స్థానంలో ఉన్నట్లు విక్రయ గణాంకాలు సూచిస్తున్నాయి.
షైన్‌కు భారీ డిమాండ్
2026 ఆగస్టులో హోండా షైన్ మోడల్ 1,80,626 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 1,63,963 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు సుమారు 10 శాతం పెరిగాయి. షైన్ 100 మోడల్ ఆగస్టులో 19,895 యూనిట్లు అమ్ముడైంది. అయితే గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ మోడల్ విక్రయాలు 12.09 శాతం తగ్గాయి. హోండా తన షైన్ కుటుంబంలో 100cc, 125cc విభాగాల్లో మోడళ్లను అందిస్తోంది. షైన్ 125, SP 125 మోడళ్లను కలిపి ఆగస్టులో 1,60,731 యూనిట్ల విక్రయాలు నమోదైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
ధరలు, ఇంజిన్ వివరాలు
హోండా షైన్ 100 ధర రూ.65,642గా ఉంది. షైన్ 125 ధర రూ.87,081 కాగా, SP 125 ధర రూ.97,335గా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.. షైన్ 125లో 123.94cc, 4-స్ట్రోక్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8kW పవర్, 10.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. షైన్ 100లో 98.98cc, 4-స్ట్రోక్ SI ఇంజిన్ ఉండగా, ఇది 5.43kW పవర్, 8.05Nm టార్క్‌ను అందిస్తుంది.
ఇతర హోండా బైక్‌ల అమ్మకాలు
షైన్ తర్వాత హోండా పోర్ట్‌ఫోలియోలో యూనికార్న్ కూడా మంచి విక్రయాలు సాధించింది. ఆగస్టులో 35,394 యూనిట్లు అమ్ముడయ్యాయి. హోండా డియో 27,670 యూనిట్లు, CB 350 మోడల్ 5,757 యూనిట్లు, హార్నెట్ 125 4,089 యూనిట్లు, హైనెస్ 350 3,295 యూనిట్లు, SP 160 మోడల్ 2,028 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. మొత్తంగా ఆగస్టు నెలలో హోండా టూ-వీలర్ ఇండియా అమ్మకాలు పెరగడంలో షైన్ మోటార్‌సైకిల్ కీలక పాత్ర పోషించినట్లు విక్రయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?