Site icon NTV Telugu

Honda Anniversary Editions: స్టైల్, పవర్, హిస్టరీ కేర్ ఆఫ్ హోండా.. 25వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్స్ లాంచ్!

Honda

Honda

Honda Anniversary Editions: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycle & Scooter India (HMSI)) భారత మార్కెట్లో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ తన మూడు ఐకానిక్ మోడల్స్ అయినా Activa 110, Activa 125, SP125ల 25వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్లను విడుదల చేసింది. 2001లో మొదటిసారి పరిచయం అయిన హోండా ఆక్టివా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా ఇప్పటికి కొనసాగుతుంది. అలాగే SP125 కూడా హోండా కంపెనీకి సంబంధించిన బైకులలో విజయవంతమైన నిలిచింది. మీరు ఈ కొత్త 25వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ వెర్షన్ల ఫీచర్లను, వివరాలను చూసేద్దామా..

డిజైన్‌లో ప్రీమియం టచ్:
ఈ 25వ వార్షికోత్సవ ఎడిషన్ మోడల్స్‌కు ఓ ప్రత్యేక వార్షికోత్సవ గ్రాఫిక్స్, అలాగే వాహనాల ముందు భాగంలో స్లీక్ బ్లాక్ క్రోమ్ ఫినిష్, ఇంకా ఫ్రంట్ ప్యానెల్‌పై 25వ వార్షికోత్సవ లోగో వంటి ప్రత్యేక డిజైన్ ను తీసుకవచ్చింది కంపెనీ. ఇక వీటిలోని అల్లాయ్ వీల్స్‌కి ఆకర్షణీయమైన పైరైట్ బ్రౌన్ మెటాలిక్ కలర్ ఫినిష్ ఉంది. యాక్టీవా 110లో సీటు, ఇన్నర్ ప్యానెల్స్ కేఫే-బ్రౌన్ లేదా బ్లాక్‌లో ఉంటే, అదే యాక్టీవా 125లో బ్లాక్ మాత్రమే అందించబడింది. ఈ మోడల్స్ పెర్ల్ సైరెన్ బ్లూ, మాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ వంటి రెండు కలర్ షేడ్స్‌లో వస్తాయి. ఇక మరోవైపు SP125 కూడా కొత్త గ్రాఫిక్స్, ఫ్యూయల్ ట్యాంక్‌పై 25వ వార్షికోత్సవ లోగో, పైరైట్ బ్రౌన్ అల్లాయ్ వీల్స్‌తో మరింత స్టైలిష్‌గా మారింది.

Corporate Bookings : సినిమాల్లో కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి?

ఫీచర్లు:
ఈ మూడు మోడల్స్‌లోనూ ఫుల్ LED హెడ్‌ల్యాంప్, 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. యాక్టీవా 110లో 109.51cc సింగిల్ సిలిండర్ PGM-Fi OBD2B ఇంజిన్, యాక్టీవా 125లో 123.92cc ఇంజిన్, SP125లో 123.94cc ఇంజిన్ అమర్చబడ్డాయి. సేఫ్టీ కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, హోండా CBS (కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంకా ట్యూబ్‌లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఎడిషన్‌ల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు చివరి నాటికి HMSI ధ్రువీకరణ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

Vu Glo QLED TV: థియేటర్ ఫీలింగ్ గ్యారంటీ! సౌండ్, పిక్చర్, స్మార్ట్ ఫీచర్స్ అన్నీ మాక్స్ లెవెల్‌లో ఉండే కొత్త స్మార్ట్ టీవీలు..

హోండా 25వ వార్షికోత్సవ ఎడిషన్ మోడల్స్ ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రకారం హోండా యాక్టీవా110 రూ.92,565, హోండా యాక్టీవా 125 రూ.97,270, మరియు హోండా SP125 రూ.1,02,516గా ఉన్నాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్స్‌ను కస్టమర్లు హోండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని హోండా ధ్రువీకరణ డీలర్‌షిప్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

Exit mobile version