Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Honda Elevate Suv To Launch Tomorrow Features Mileage And More

Honda Elevate: రేపే హోండా ఎలివేట్ లాంచ్.. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ఎంట్రీ..

Published Date :September 3, 2023 , 6:05 pm
By Venu Goapl Reddy
Honda Elevate: రేపే హోండా ఎలివేట్ లాంచ్.. ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ఎంట్రీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాాంపాక్ట్ SUV సెగ్మెంట్లో తన ఎలివేట్ కారును తీసుకొస్తోంది. రేపు హోండా ఎలివేట్ లాంచ్ కాబోతోంది. 4 సెప్టెంబర్ 2023న భారతదేశంలో ఇండియన్ మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. హోండా ఇండియాలోని కాంపాక్ట్ SUV మార్కెట్ లో వాటా దక్కించుకోవాలని అనుకుంటోంది.

ప్రస్తుతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా టైగున్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లకు డైరెక్ట్ కాంపిటీటర్ గా హోండా ఎలివేట్ ఉండబోతోంది.

హోండా ఎలివేట్ ఫీచర్లు, మైలేజ్..

హోండా ఎలివేట్ ఫుల్లీ లోడెట్ ఫీచర్లలో రాబోతోంది. ముఖ్యంగా భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, తక్కుర ధరల్లోనే ఎక్కువ ఫీచర్లు ఉండేలా చూసుకుంది. అయితే కంపెనీ ధరను ఇప్పటి వరకు ప్రకటించకున్నా.. రూ. 11 లక్షల నుంచి రూ.15 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్ ధరను కూడా రేపే ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ని జూలై నెలలో తెరిచారు. రూ. 21,000 టోకెన్ మనీతో కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారు. ధరలు ప్రకటించిన తర్వాత సోమవారం నుంచి కస్టమర్లకు ఈ కార్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఎలివేట్ కార్ ఫ్రంట్ ఎండ్ క్రోమ్‌తో, LED హెడ్‌ల్యాంప్‌లతో అట్రాక్టివ్ గ్రిల్ తో వస్తోంది. బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, దాదాపుగా 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కార్ SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఫీనిక్స్ ఆరెంజ్, లూనార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కలర్లలో లభ్యమవుతుంది. డ్యుయల్ టోన్స్ లో కూడా ఎలివేట్ అందుబాటులో ఉంటుంది.

ఫీచర్ల విషయానికి వస్తే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో, 7-అంగుళాల HD కలర్ TFT డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్ ఉంది.

హోండా ఎలివేట్ మైలేజ్..

హోండా సిటీ సెడాన్ కు వచ్చే 1.5 లీటర్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్ ఎలివేట్ లో కూడా ఉంటుంది. ఇది గరిష్టంగా 119 బీహెచ్‌పీ శక్తితో, 145.1 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CVT, సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ కి 15.31 కి.మీ, సీవీటీ లో 16.92 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Honda Elevate
  • Honda Elevate Features
  • Honda Elevate Mileage
  • hyundai creta
  • Maruti Suzuki Grand Vitara

తాజావార్తలు

  • SRH vs KKR: క్లాసెన్ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్‌ 227 పరుగులు..

  • PVN Madhav: ఇది చారిత్రాత్మకం.. జై అమరావతి.. జై జై అమరావతి..

  • Suzuki Burgman: సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125.. 125cc సెగ్మెంట్‌లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్?

  • Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

  • Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్‌ ట్రంప్‌..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions