Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా కాాంపాక్ట్ SUV సెగ్మెంట్లో తన ఎలివేట్ కారును తీసుకొస్తోంది. రేపు హోండా ఎలివేట్ లాంచ్ కాబోతోంది. 4 సెప్టెంబర్ 2023న భారతదేశంలో ఇండియన్ మార్కెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. హోండా ఇండియాలోని కాంపాక్ట్ SUV మార్కెట్ లో వాటా దక్కించుకోవాలని అనుకుంటోంది.
ప్రస్తుతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా టైగున్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లకు డైరెక్ట్ కాంపిటీటర్ గా హోండా ఎలివేట్ ఉండబోతోంది.
హోండా ఎలివేట్ ఫీచర్లు, మైలేజ్..
హోండా ఎలివేట్ ఫుల్లీ లోడెట్ ఫీచర్లలో రాబోతోంది. ముఖ్యంగా భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని, తక్కుర ధరల్లోనే ఎక్కువ ఫీచర్లు ఉండేలా చూసుకుంది. అయితే కంపెనీ ధరను ఇప్పటి వరకు ప్రకటించకున్నా.. రూ. 11 లక్షల నుంచి రూ.15 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్ ధరను కూడా రేపే ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ కార్ బుకింగ్స్ ని జూలై నెలలో తెరిచారు. రూ. 21,000 టోకెన్ మనీతో కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారు. ధరలు ప్రకటించిన తర్వాత సోమవారం నుంచి కస్టమర్లకు ఈ కార్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఎలివేట్ కార్ ఫ్రంట్ ఎండ్ క్రోమ్‌తో, LED హెడ్‌ల్యాంప్‌లతో అట్రాక్టివ్ గ్రిల్ తో వస్తోంది. బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, దాదాపుగా 220 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కార్ SV, V, VX, ZX అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఫీనిక్స్ ఆరెంజ్, లూనార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, రేడియంట్ రెడ్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ కలర్లలో లభ్యమవుతుంది. డ్యుయల్ టోన్స్ లో కూడా ఎలివేట్ అందుబాటులో ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో, 7-అంగుళాల HD కలర్ TFT డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఉంది.
హోండా ఎలివేట్ మైలేజ్..
హోండా సిటీ సెడాన్ కు వచ్చే 1.5 లీటర్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్ ఎలివేట్ లో కూడా ఉంటుంది. ఇది గరిష్టంగా 119 బీహెచ్‌పీ శక్తితో, 145.1 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. CVT, సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో అందుబాటులో ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ కి 15.31 కి.మీ, సీవీటీ లో 16.92 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.