Honda Elevate: హోండా నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న మిడ్ సైజ్ SUV కారు ఎలివేట్. భారత మార్కెట్ లోకి తన తొలి SUV కారును తీసుకువచ్చింది. లుకింగ్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా, అత్యధునికి ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి రాబోతోంది. కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజీ ఆస్టర్లకు పోటీ ఇవ్వబోతోంది. భారతదేశంలో హోండా ఎలివేట్ ధర రూ. 10.50 లక్షల నుండి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. హోండా ఎలివేట్ బుకింగ్‌లు అధికారికంగా జూలైలో ప్రారంభం అవనున్నాయి.
భారత దేశం కార్ మార్కెట్ లో ప్రస్తుతం మిడ్ సైజ్ SUVల అమ్మకాల జోరు పెరిగింది. ప్రతీ కార్ మేకర్ కూడా హ్యచ్ బ్యాక్, సెడాన్ కార్ల కన్నా SUV కార్ల తయారీకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోండా 2030 నాటికి ఇండియన్ మార్కెట్ లోకి 5 స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (SUVలు)ని తీసుకురావాలనుకుంటోంది. ఇందులో మొదటగా ఎలివేట్ ను పరిచయం చేస్తోంది. ఎలివేట్ ఆధారంగా ఒక బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ ను (BEV) మూడు సంవత్సరాలలో భారతదేశంలో ప్రవేశపెట్టనుంది.
హోండా ఎలివేట్ ఫీచర్లు ఇవే:
హోండా ఎలివేట్ LED హెడ్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED టైల్‌లైట్లు మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో హోండా యొక్క సిగ్నేచర్ గ్రిల్‌తో వస్తోంది. కారు పొడవు 4,312mm, వెడల్పు 1,790mm మరియు ఎత్తు 1,650mm కాగా.. 220mm గ్రౌండ్ క్లియరెన్స్, 2,650mm వీల్ బేస్ కలిగి ఉంటుంది.
ప్యూయల్ వినియోగం, ట్రిప్ మీటర్, ఉష్ణోగ్రత వివరాలను అందించే 7 ఇంచ్ హెచ్ డీ TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేని కలిగి ఉండనుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిట్ ఆటోకు సపోర్ట్ చేసే విధంగా 10.25 ఇంచ్ IPS HD రిజల్యూషన్ LCD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో ఎలివేట్ రాబోతోంది. 458 లీటర్ల భారీ బూట్ స్పేస్ కలిగి ఉంది.
హోండా ఎలివేట్ 1.5-లీటర్ i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండనుంది. ఇది 121PS గరిష్ట శక్తిని, 145Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 6-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ CVT ఆటోమేటిక్ ఉన్నాయి. హోండా ఎలివేట్ మైలేజ్ గణాంకాలను కార్ల తయారీదారు ఇంకా వెల్లడించలేదు.