ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ కొత్త మోడళ్లను పరిచయం చేశాయి. ఎలక్ట్రిక్ కార్లను కూడా ఆవిష్కరించాయి. ఇక ఈ ఏడాది మొదటి నెల జనవరిలో కార్ల అమ్మకాలు రికార్డ్ సృష్టించాయి. తాజాగా కార్ లవర్స్ కు మరో కొత్త కారు అందుబాటులోకి వచ్చింది. హోండా కార్స్ ఇండియా సిటీ అపెక్స్ లిమిటెడ్ ఎడిషన్ సెడాన్ ను రిలీజ్ చేసింది. ఇది కొత్త బ్యాడ్జింగ్, అప్ గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్, 1.5లీటర్ ఇంజన్ ను కలిగి ఉంది. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అందించారు. అపెక్స్ ఎడిషన్ ఎక్స్‌క్లూజివ్ సీట్ కవర్లు, కుషన్లు, రిథమిక్ యాంబియంట్ లైట్, ప్రీమియం లెథరెట్ డోర్ ప్యాడింగ్, ఫెండర్‌పై అపెక్స్ ఎడిషన్ బ్యాడ్జ్, ట్రంక్‌పై అపెక్స్ ఎడిషన్ చిహ్నంతో వస్తుంది.
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ధర:
సరికొత్త హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ దాని మిడ్-వి ట్రిమ్ ధర రూ. 13.30 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్ విఎక్స్ వేరియంట్ ధర రూ. 15.62 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది. కారు లేత గోధుమరంగులో ప్రత్యేక ఎడిషన్ సీట్ కవర్లు, ప్రీమియం లెథెరెట్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, డోర్ ప్యాడింగ్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, సెడాన్ ఏడు కలర్స్, షేడ్స్‌తో కూడిన యాంబియంట్ లైటింగ్‌ను కలిగి ఉంది. సెడాన్ 119 bhp ఎనర్జీని, 145 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ నుంచి శక్తిని పొందుతుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7-స్టెప్ CVT ఆటోమేటిక్‌తో జత చేయబడింది.
సెడాన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 17.8 kmpl, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 18.4 kmpl మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఫీచర్ల విషయానికి వస్తే.. హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, ఒక లేన్ వాచ్ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది