Honda ADV125 Launched: హోండా అడ్వెంచర్ స్కూటర్ లైనప్‌లో సరికొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. EICMA 2026 వేదికగా Honda ADV125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. పెద్ద ADV స్కూటర్ల తరహాలోనే రగ్గడ్ డిజైన్‌తో రూపొందించిన ఈ స్కూటర్‌ను తక్కువ ధర విభాగంలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా యూరప్‌లో పట్టణ ప్రయాణికులు, A1 లైసెన్స్ కలిగిన రైడర్లను లక్ష్యంగా చేసుకుంది.
Honda ADV125 ఇంజిన్, మైలేజ్
ఈ స్కూటర్‌లో 125cc లిక్విడ్ కూల్డ్ eSP+ SOHC 4-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,750 rpm వద్ద 12.5 PS పవర్, 6,500 rpm వద్ద 11.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్‌ను Honda PCX125లోనూ ఉపయోగిస్తున్నారు. గంటకు 97 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించారు. మైలేజ్ విషయానికి వస్తే.. WMTC ప్రమాణాల ప్రకారం లీటరుకు సుమారు 47.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 8.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఫుల్ ట్యాంక్‌తో సుమారు 385 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. హోండా సెలెక్టల్ టార్క్ కంట్రోల్ (HSTC), PGM-FI ఫ్యూయల్ ఇంజెక్షన్, ఐడీలింగ్ స్టాప్ సిస్టం వంటి టెక్నాలజీలు ఉన్నాయి.
SUV తరహా డిజైన్
Honda ADV125ను మస్కులర్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో పెద్ద విండ్‌స్క్రీన్, DRLలతో కూడిన డ్యూయల్ హెడ్‌ల్యాంప్స్, స్టెప్-అప్ సీట్, పైకి వంగిన ఎగ్జాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ స్కూటర్ పెర్ల్ ఫాల్కన్ గ్రే, పెర్ల్ కూల్ వైట్, మ్యాట్ సైనోస్ గ్రే మెటాలిక్, మ్యాట్ పెర్ల్ డయాస్ప్రో రెడ్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్‌లో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. 14 అంగుళాల ఫ్రంట్, 13 అంగుళాల రియర్ వీల్స్ ఇచ్చారు. ముందు 240mm, వెనుక 220mm డిస్క్ బ్రేకులు, సింగిల్ ఛానల్ ABS అందించారు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 780mm సీట్ హైట్‌తో వస్తుంది. స్టోరేజ్ కోసం సీటు కింద 29 లీటర్ల స్థలం, ముందు భాగంలో 2 లీటర్ల గ్లోవ్ బాక్స్ ఇచ్చారు.
టెక్నాలజీ ఫీచర్లు
Honda ADV125లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, Honda RoadSync కనెక్టివిటీ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవడం ద్వారా నావిగేషన్, మెసేజ్‌లు, మ్యూజిక్ కంట్రోల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. హోండా స్మార్ట్ కీ ద్వారా కీ లేకుండానే స్కూటర్‌ను స్టార్ట్ చేయవచ్చు. సీటు, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్‌ను కూడా తెరవవచ్చు. USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్‌ను అందించారు. వీటితోపాటు హీటెడ్ గ్రిప్స్, సెక్యూరిటీ బజర్, రియర్ క్యారియర్, 40 లీటర్ల టాప్ బాక్స్ వంటి యాక్సెసరీలు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ స్కూటర్ ధర, భారత్‌లో లాంచ్ వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు.

