Hero Xoom 160: అత్యాధునిక ఫీచర్లతో స్టైలిష్ స్కూటర్‌ను తీసుకొచ్చిన హీరో మోటోకార్ప్
- హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్.
- అత్యాధునిక ఫీచర్లతో స్టైలిష్ లుక్ కలిగిన హీరో జూమ్ 160.
- ధర కాస్త ఎక్కువైనా.. అందుకు తగ్గట్టుగా పలు అధునాతన ఫీచర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో జూమ్ 160 (Xoom 160) స్కూటర్‌ను లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ స్కూటర్ బైక్‌తో పోలిస్తే తక్కువ, కానీ రెగ్యులర్ స్కూటర్ కంటే అధునాతనమైన ఫీచర్లతో మార్కెట్ లోకి రానుంది. ఈ స్కూటర్ అత్యాధునిక డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, అనేక ఆధునిక ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి వచ్చేసింది. మరి వాటి విశేషాలేంటో ఒకసారి చూద్దామా..
Also Read: China : డీప్‌సీక్ తర్వాత మరో ఘనత సాధించిన చైనా.. అది ఏంటంటే ?
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
హీరో జూమ్ 160 స్కూటర్ మోడర్న్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో split-LED హెడ్‌లైట్, విండ్ స్క్రీన్ వంటి ఆధునిక డిజైన్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నాయి. ఈ స్కూటర్ కాస్ట్ పర్ల్ సమ్మిట్ వైట్ (Cast Pearl Summit White), కాస్ట్ కేనియన్ రెడ్ (Cast Canyon Red), కాస్ట్ వోల్కానిక్ గ్రే (Cast Volcanic Grey), కాస్ట్ మ్యాట్ రైన్ ఫారెస్ట్ గ్రీన్ (Cast Matte Rain Forest Green) అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.
ఈ Xoom 160 స్కూటర్ 156cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 14 bhp పవర్, 13.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సుమారు 40 కేఎంపీఎల్ (kmpl) మైలేజ్ ఇవ్వగలదు. ఈ విషయం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ఈ కొత్త స్కూటర్‌ను రూ.1.48 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. ఈ స్కూటర్ పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా తమ రోజువారీ ప్రయాణాల కోసం ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇక ధర కాస్త ఎక్కువగా కనిపిస్తున్నా.. అందుకు తగ్గట్టుగా ఈ స్కూటర్ పలు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
ఇక ఈ హీరో జూమ్ 160 స్కూటర్లో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, i3S సిస్టమ్ (Idle Stop-Start Technology), సైలెంట్ స్టార్టర్, కీలెస్ ఇగ్నిషన్, సస్పెన్షన్ & బ్రేకింగ్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ స్కూటర్ లోని డబుల్ డిస్క్ బ్రేక్స్ తో రైడర్‌కు మెరుగైన కంఫర్ట్, సేఫ్టీని అందిస్తుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..