Site icon NTV Telugu

పేదోడి బైక్ Hero Splendor Plus ధర పెంపు.. వేరియంట్ వారీగా కొత్త రేట్లు ఇలా..!

Hero Splendor Plus

Hero Splendor Plus

Hero Splendor Plus: ఆటో మార్కెట్‌లో పేదోడి బైకుగా నిలిచిన హీరో స్ప్లెండర్ (Hero Splendor) మూడు దశాబ్దాలుగా ప్రజల మన్నన పొందింది. అయితే ఇప్పుడు ఈ బైక్‌కు ఇప్పుడు ధర స్వల్పంగా పెరిగింది. పెరుగుతున్న భాగాల ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలను సమతుల్యం చేయడానికి హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అయితే ఈ పెరుగుదల చాలా స్వల్పంగా ఉండటంతో వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

కొత్త లుక్‌, ఫీచర్లు, వేరియంట్లతో 2026 Bajaj Pulsar 125 లాంచ్.. ధర ఎంతంటే..!

హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. నమ్మకమైన పనితీరు, అద్భుతమైన మైలేజ్ కారణంగా ఈ బైక్‌పై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ పెంపు కారణంగా స్ప్లెండర్ ప్లస్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇందులో అదే 100cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ ఉంటాయి.

ఈ ఇంజిన్ 7.09 bhp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సస్పెన్షన్ సెటప్‌గా ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు అందించారు. ఈ బలమైన సెటప్ వల్ల రోజువారీ ప్రయాణాలకు బైక్ మరింత నమ్మకంగా ఉంటుంది. 2025 ప్రారంభంలో స్ప్లెండర్ ప్లస్ బేస్ వేరియంట్ ధర రూ. 80,000 దాకా చేరింది. అయితే సెప్టెంబర్ 2025లో అమల్లోకి వచ్చిన GST 2.0 వల్ల ధరలు కొంత స్థిరంగా నిలిచాయి. తాజా ధర పెంపు ఉత్పత్తి ఖర్చులు పెరగడమే కారణంగా హీరో చెబుతోంది. అయినప్పటికీ రూ.250ల పెరుగుదల కొనుగోలుదారుల నిర్ణయంపై ప్రభావం చూపదని కంపెనీ చెబుతోంది.

Realme P4 Power 5G Launch: 10001mAh బ్యాటరీ.. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గేమ్‌ఛేంజర్‌గా రియల్‌మీ పీ4 పవర్‌!

వేరియంట్ వారీగా కొత్త ధరలు (ఎక్స్-షోరూమ్):

డ్రమ్:
పాత ధర: రూ. 73,902 → కొత్త ధర: రూ. 74,152

i3S:
పాత ధర: రూ. 75,055 → కొత్త ధర: రూ. 75,305

125 మిలియన్ ఎడిషన్:
ఈ వేరియంట్ లో ఎలాంటి ధర మార్పు లేదు. బైకు ధర రూ. 76,437

Xtec:
పాత ధర: రూ. 77,428 → కొత్త ధర: రూ. 77,678

Xtec 2.0 (డ్రమ్):
పాత ధర: రూ. 79,964 → కొత్త ధర: రూ. 80,214

Xtec 2.0 (డిస్క్):
పాత ధర: రూ. 80,471 → కొత్త ధర: రూ. 80,721

Exit mobile version