ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోకి ఎన్నో ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి. అయితే పెరిగిన డీజిల్, పెట్రోల ధరల దృష్ట్యా… ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ సంస్థ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. Vida VX2 Go పేరుతో ఈ కొత్త రకం మోడల్ బైక్ ను తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర 1.02 లక్షలుగా ఫిక్స్ చేసింది హీరో యాజమాన్యం.. ఢిల్లీలోని షోరూంలో మాత్రమే ఈ రేటు వర్తిస్తుందని.. వేరే ప్రాంతాల్లో ధర మార్చే అవకాశం ఉంటుందని హీరో యాజమాన్యం వెల్లడించింది.
Read Also:Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే..
అయితే.. ఈ Vida VX2 Go బైక్ ఫీచర్స్ ఒకసారి పరిశీలించినట్లయితే… ఇందులో 3.4 kwh బ్యాటరీ ఆప్షన్ తో నడుస్తోంది.. ఈ బైక్ ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 100 కిలో మీటర్ల మైలేజ్ కూడా ఇస్తుందని సమాచారం. గంటకు 70 కిలో మీటర్ల వేగంతో ఈ బైక్ దూసుకు వెళ్తుందని మెనేజ్మెంట్ వెల్లడించింది. 4.3 ఇంచుల డిస్ప్లే అందిస్తున్నారు. ఈ బైక్ ను స్మార్ట్ ఫోన్ తో కూడా కనెక్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్ ఆప్షన్స్ కూడా మనకు వస్తాయని… ఈ నెలలోనే బైక్స్ డెలివరీలు ప్రారంభమవుతాయని సమాచారం.
