Site icon NTV Telugu

X440 T vs Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ.. హార్లే-డేవిడ్సన్ X440 Tలో 5 ప్రత్యేక ఫీచర్లు..

Harley Davidson X440t Vs Royal Enfield Classic350

Harley Davidson X440t Vs Royal Enfield Classic350

Harley-Davidson X440 T vs Royal Enfield Classic 350: హార్లే–డేవిడ్సన్ మళ్లీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి దిగింది. హార్లే–డేవిడ్సన్ భారత మార్కెట్‌లో కొత్త X440 T బైక్‌ను విడుదల చేసింది. ఇది X440 సిరీస్‌లో టాప్ వేరియంట్. ఇది హీరో–హార్లే బైక్స్‌లో మూడు సంవత్సరాల క్రితం వచ్చిన X440 తర్వాత వచ్చిన పెద్ద అప్‌డేట్ గా చెబుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇప్పటికీ రెట్రో క్రూయిజర్ బైక్‌లలో ఆధిపత్యం చూపిస్తోంది. కానీ X440 T మాత్రం ఆధునిక టెక్నాలజీతో, రైడర్‌కు అనుకూలమైన ఫీచర్లతో ముందుకు వస్తోంది. పాత స్టైల్‌తో పాటు కొత్త టెక్నాలజీ కావాలనుకునే వారికి X440 T కొన్ని ప్రత్యేక ఫీచర్లతో క్లాసిక్ 350 కంటే ముందుంది.

READ MORE: Chhattisgarh: మావోల్లో పరివర్తనం.. ఆయుధాలతో 12 మంది లొంగుబాటు

X440 T బైక్‌లో రైడ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి రైడింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా పవర్, థ్రాటిల్ రెస్పాన్స్‌ని మార్చుకునే అవకాశం ఇస్తాయి. ఇందులో రోడ్, రైన్ అనే రెండు మోడ్‌లు ఉన్నాయి. రైన్ మోడ్‌లో ట్రాక్షన్ కంట్రోల్, వెనుక ABS‌ను ఆఫ్ చేయలేం. అలాగే రైన్ మోడ్‌లో టార్క్ అవుట్‌పుట్ 10 శాతం తక్కువగా ఉంటుంది. ఈ బైక్‌లో స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఈ ఫీచర్ క్లాసిక్ 350లో లేదు. ఇది అకస్మాత్తుగా వేగం పెంచినప్పుడు లేదా నునుపు రోడ్డుపై చక్రాలు జారకుండా కాపాడుతుంది. దీంతో బైక్ స్థిరంగా ఉంటుంది. ప్రమాద అవకాశాలు తగ్గుతాయి.

READ MORE: IPL 2026 Auction: ఐపీఎల్‌ 2026 వేలం నుంచి 1,005 మంది ప్లేయర్స్ ఔట్.. చివరి నిమిషంలో డికాక్‌ పేరు!

రెండు బైక్‌లలో కూడా డ్యుయల్ ఛానల్ ABS ఉంటుంది. కానీ X440 Tలో ప్రత్యేకంగా వెనుక ABS‌ను స్విచ్ చేసి ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇది ఆఫ్–రోడ్ రైడింగ్ లేదా కొంచెం స్పోర్టీ రైడింగ్ చేసేవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. X440 Tలో రైడ్–బై–వైర్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇందులో పాత కేబుళ్ల బదులు ఎలక్ట్రానిక్ థ్రాటిల్ ఉంటుంది. దీని వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా, ఖచ్చితంగా ఉంటుంది. కానీ క్లాసిక్ 350లో ఇప్పటికీ పాత మెకానికల్ సిస్టమ్‌నే ఉపయోగిస్తున్నారు. ఎమర్జెన్సీగా బ్రేక్ వేస్తే X440 Tలో పానిక్ బ్రేక్ అలర్ట్ పనిచేస్తుంది. అప్పుడు వెనుక వాహనాలకు హెచ్చరికగా ఇండికేటర్లు ఫ్లాష్ అవుతాయి.

READ MORE: Anant Ambani Award: అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు.. మొదటి ఆసియా విజేతగా..

హార్లే–డేవిడ్సన్ X440 T ధర రూ.2.80 లక్షలు (ఎక్స్–షోరూమ్). ఇందులో రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండటం వల్ల ఇది మిగతా వేరియంట్‌ల కంటే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇప్పుడు X440 సిరీస్‌లో మూడు వేరియంట్‌లు ఉన్నాయి. Vivid, S, T. వీటి ధరలు రూ.2.35 లక్షల నుంచి రూ.2.80 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్–షోరూమ్). మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 తక్కువ ధరలో లభిస్తోంది. దీని ధరలు రూ.1,81,118 నుంచి రూ.2,15,750 (ఎక్స్–షోరూమ్) వరకు ఉన్నాయి. హార్లే బైక్ ఖరీదుగా ఉండడానికి ముఖ్య కారణం GST పన్ను. క్లాసిక్ 350పై 18 శాతం GST ఉంటే, X440కి 40 శాతం GST పడుతుంది. 350ccకి మించి ఇంజిన్ సామర్థ్యం ఉండటమే దీనికి కారణం.

Exit mobile version