Harley-Davidson Sprint 440: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ (Harley-Davidson) సరికొత్త Sprint 440 మోటార్‌సైకిల్‌ను EICMA 2026లో అధికారికంగా ఆవిష్కరణ చేసింది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బైక్‌లో 440cc ఇంజిన్, ఆకర్షణీయమైన క్రూయిజర్ డిజైన్, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. 2026 EICMA మోటార్‌సైకిల్ షోలో ఇది ప్రజల ముందుకు రానుంది. ఈ కొత్త Sprint 440లో 440cc సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 6,000rpm వద్ద 26.7bhp పవర్, 4,000rpm వద్ద 38Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను అమర్చారు. కంపెనీ తెలిపిన ప్రకారం ఈ బైక్ లీటరుకు సుమారు 34 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇందులో 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.
ఈ బైక్‌లో టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, వెనక్కి వంగిన హ్యాండిల్‌బార్, స్టెప్డ్ సీటు, లో-మౌంటెడ్ ఎగ్జాస్ట్ వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి. దీని సీటు ఎత్తు 671 మిల్లీమీటర్లు మాత్రమే. ముందు భాగంలో 19 అంగుళాల, వెనుక 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఇచ్చారు. అలాగే ఇందులో 3.5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే, ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్, USB-C ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ముందు 320mm, వెనుక 240mm డిస్క్ బ్రేకులతో పాటు ABS అందించారు. ముందు భాగంలో 43mm అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక 7 స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ 147 మిల్లీమీటర్లుగా ఉంది.
యూకేలో ఈ బైక్ ప్రారంభ ధర 4,995 పౌండ్లుగా ప్రకటించారు. అమెరికాలో ధర 6,000 డాలర్లుగా ఉండనుంది. అమెరికాలో 2027 డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అక్కడి యార్క్, పెన్సిల్వేనియా ప్లాంట్‌లో తుది అసెంబ్లీ చేపట్టనున్నారు. భారత్‌లో ఈ బైక్ ధర సుమారు రూ.3.5 లక్షలుగా ఉండవచ్చని అంచనా. అయితే ఇండియా లాంచ్ తేదీ, అధికారిక ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

