Electric Cars: భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ 2025లో భారీ వృద్ధిని సాధించింది. 2024తో పోలిస్తే 2025లో 77శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఈవీ అమ్మకాలు 2024లో 99,875 యూనిట్ల నుండి 2025లో 176,815 యూనిట్లకు పెరిగాయి. ఇది ఈవీ మార్కెట్ డిమాండ్‌ను సూచిస్తోంది. టాటా మోటార్స్(Tata Motors) ఈవీ మార్కెట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2025లో 70,004 యూనిట్లను విక్రయించింది. నెక్సాన్ EV, టియాగో EV వంటి ప్రముఖ మోడళ్లు టాటా మోటార్స్‌ను అగ్రస్థానంలో కొనసాగేలా చేస్తున్నాయి.
Read Also: Jana Sena Party: ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన కీలక విజ్ఞప్తి.. అది వ్యవస్థ లోపమే..!
టాటా అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, JSW MG 51,387 యూనిట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఎంజీ 135 శాతం వృద్ధిని నమోదు చేసింది. విండ్‌సర్ EV అమ్మకాల్లో టాటాకు సవాల్ విసురుతోంది. ప్రో వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను తీసుకురావడంతో విండ్‌సర్ అమ్మకాలు, డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, మహీంద్రా ఏకంగా 350 శాతం వృద్ధిని నమోదు చేసి, అందర్ని ఆశ్చర్యపరిచింది. 2025లో 33,513 యూనిట్లను విక్రయించింది. XUV400 రూపంలో మరో ఈవీని మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. మరోవైపు, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు వరసగా 6,726 యూనిట్లు, 5,402 యూనిట్లను విక్రయించాయి. బీవైడీ నుంచి అట్టో 3 మంచి అమ్మకాలను నమోదు చేసింది.
