ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ కాలుష్యం జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ పొల్యూషన్ పెరగడానికి ప్రధాన కారణం.. పాత వాహనాలు ఇంకా రోడ్లపై తిరుగుతుండటం. దీంతో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకుంది. ఇకపై వీటికి పెట్రోల్ బంకుల్లో 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టింది. రవాణా శాఖ లెక్కల ప్రకారం, ఢిల్లీలో ఉన్న పాత వాహనాల సంఖ్య దాదాపు 60 లక్షలని రవాణా శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నిబంధనల నేపథ్యంలో ఢిల్లీ వాసులు తక్కువ ధరలకు తమ కార్లను విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎగిరి గంతేస్తున్నారు. కానీ.. కొందరు ఢిల్లీ వాసులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Electric Air Taxi: దుబాయ్‌లో ఎయిర్ టాక్సీ ప్రయోగం విజయవంతం.. కమర్షియల్ సేవలు ప్రారంభం..?
ఢిల్లీకి చెందిన వరుణ్ విజ్ అనే వ్యక్తి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన తన మెర్సిడెస్-బెంజ్ ML350 కారును విక్రయించాడు. ఇందులో విశేషం ఏముందని మీరు అనుకునే ఉంటారు. వరుణ్ రూ. 84 లక్షల కారును కేవలం.. రూ. 2.5 లక్షలకే విక్రయించాడు. ఈ అంశంపై వరుణ్ విజ్ స్పందిస్తూ.. “2015లో కొనుగోలు చేసిన నా మెర్సిడెస్-బెంజ్ ML350 కారును చాలా తక్కువ ధరకు అమ్మవలసి వచ్చింది. 2015లో రూ.84 లక్షలకు ఈ లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశాను. ఈ కారు ప్రస్తుతం మంచి కండీషన్‌లో ఉంది. ఇప్పటి వరకు 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. దానిని రూ.2.5 లక్షలకు అమ్మవలసి వచ్చింది. నేను నా కారును బలవంతంగా అమ్మాల్సి వచ్చింది.” అని విజ్ పేర్కొన్నాడు.
READ MORE: Microsoft Layoffs: ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. ఏకంగా 9 వేల మందికి లేఆఫ్ నోటీసులు
