BYD Yangwang U9 Xtreme: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD మరో సంచలనం సృష్టించింది. కంపెనీకి చెందిన హైపర్‌కార్ BYD Yangwang U9 Xtreme ప్రపంచంలోనే 500 kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారుగా చరిత్ర సృష్టించింది. అబుదాబిలో నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో ఏకంగా 503.17 kmph గరిష్ట వేగాన్ని నమోదు చేసింది. ఈ ఘనతకు గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది.
BYD Yangwang U9 Xtremeలో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఇవి కలిపి గరిష్టంగా 2,977 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో మోటార్ 30,000 RPM వరకు పనిచేయగలదు. BYDకు చెందిన 1200V e4 ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును రూపొందించారు. ప్రతి సెకనుకు 100 సార్లు పారామీటర్లను సర్దుబాటు చేసే టార్క్ వెక్టరింగ్ సిస్టమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టన్నుకు 1,200 bhp పవర్ అందించడం ఈ కారు సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
అధిక వేగంతో ప్రయాణించేటప్పుడు కారు స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రత్యేక ఏరోడైనమిక్ మార్పులు చేశారు. ఇందులో కార్బన్ ఫైబర్ ఫ్రంట్ స్ప్లిటర్, డ్యూయల్ ఛానల్ హుడ్, స్వాన్ నెక్ రియర్ స్పాయిలర్, భారీ డిఫ్యూజర్ అందించారు. ఈ మార్పులు అధిక వేగంలో గాలి ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కారు కేవలం 30 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నారు. ఈ మెగాకార్‌లో 80 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. 30C డిశ్చార్జ్ రేట్‌తో పాటు 1200V, 1000A ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను అందించారు. నాలుగు మోటార్లకు అవసరమైన విద్యుత్‌ను వేగంగా సరఫరా చేయడానికి ఈ బ్యాటరీ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
గతేడాది సెప్టెంబర్‌లో జర్మనీలో జరిగిన టెస్ట్‌లో Yangwang U9 Xtreme గంటకు 496.22 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా నూర్‌బర్గ్‌రింగ్ నార్డ్‌ష్లైఫీ ట్రాక్‌పై 6 నిమిషాల 59.157 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసింది. తాజాగా అబుదాబిలో 503.17 kmph వేగాన్ని నమోదు చేసి తన పాత రికార్డును తానే అధిగమించింది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల చరిత్రలో BYD Yangwang U9 Xtreme సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
503.17 km/h! The Yangwang U9 Xtreme Pushes the Limits of Speed Once Again!
The Yangwang U9 Xtreme has completed its public-road top-speed challenge in Abu Dhabi, reaching an astonishing 503.17 km/h and setting a new global speed record.
Once again, what seemed impossible has become a new starting point. Every effort, every test and every refusal to give up has led to this moment.
A new milestone for China’s electric supercar engineering!
#Yangwang #U9Xtreme #503kmh #BYD
— DriveGreenLiveGreen (@DriveGreen80167) November 6, 2026

