రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Yangwang Altior: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ (BYD) మరో సంచలన మోడల్‌ను లాంచ్ చేసింది. తన అల్ట్రా లగ్జరీ ఫ్లాగ్షిప్ బ్రాండ్ యాంగ్వాంగ్ (Yangwang) నుంచి సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ ఆల్టియర్ (Altior)ను పరిచయం చేసింది. అత్యాధునిక ఇంజినీరింగ్, విలాసవంతమైన ఫీచర్లతో రూపొందించిన ఈ కారు ప్రధానంగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి లగ్జరీ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆల్టియర్ అనే పేరు లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. దీని అర్థం ‘ఉన్నతమైనది’ అని. చైనీస్ సంప్రదాయ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కారు డిజైన్‌ను రూపొందించారు.
అద్భుతమైన డిజైన్
BYD యాంగ్వాంగ్ ఆల్టియర్ డిజైన్‌కు పురాతన చైనా కాంస్య వేడుకల పాత్ర అయిన ‘డింగ్’ స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో ప్రత్యేకమైన జ్యువెల్డ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్ ఆకట్టుకుంటాయి. యజమాని కారు దగ్గరకు రాగానే లైటింగ్ వ్యవస్థ వరుసగా వెలుగుతూ స్వాగతం పలుకుతుంది. ఈ సెడాన్‌లో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. వీటికి మూడు రకాల డిజైన్లను ఎంచుకునే అవకాశం ఉంది.
Also Read
- TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్‌తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
- గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
- Russia vs Ukraine: 4.5 లక్షల మరణాలు..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత దారుణమైన పోరాటం!
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
ఈ కారులో కోచ్ తరహా డోర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు డోర్లు 80 డిగ్రీలు, వెనుక డోర్లు 90 డిగ్రీల వరకు తెరుచుకుంటాయి. వెనుక డోర్లు రియర్ హింజ్డ్ డిజైన్‌తో రూపొందించారు. అంతేకాకుండా ప్రతి డోర్లో ప్రత్యేకమైన గొడుగులను కూడా అందించారు. ఈ సెడాన్ పొడవు 5,600 మి.మీ., వెడల్పు 2,030 మి.మీ., ఎత్తు 1,590 మి.మీ. కాగా, వీల్‌బేస్ 3,500 మి.మీ.గా ఉంది. బ్రాంజ్, డార్క్ కలర్ కలయికతో కూడిన డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కారు లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
లగ్జరీ ఇంటీరియర్
కారు లోపల విలాసవంతమైన మెటీరియల్స్, ప్రత్యేకమైన ఫినిషింగ్ అందించారు. ఎయిర్ వెంట్స్ వద్ద ఎల్లో హెటియన్ జేడ్ మెటీరియల్‌ను ఉపయోగించారు. సీట్లపై సుజౌ ఎంబ్రాయిడరీతో కూడిన ప్రత్యేకమైన డిజైన్‌ను అందించారు. డ్యాష్‌బోర్డ్, డోర్లపై సహజమైన కలప అలంకరణలు, ఫుల్ గ్రెయిన్ సెమీ అనిలిన్ లెదర్, ప్యూర్ వూల్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. మెరుగైన టచ్ అనుభూతి కోసం ప్రత్యేకమైన మెటల్ స్విచ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఇది నాలుగు సీట్ల లగ్జరీ సెడాన్. ముఖ్యంగా వెనుక ప్రయాణికుల కోసం ఏవియేషన్ తరహా జీరో గ్రావిటీ సీట్లను అందించారు. వీటిలో ప్రత్యేక మసాజ్ సిస్టమ్ ఉంది. వెనుక ప్రయాణికులకు 354 మి.మీ. మోకాళ్ల స్థలం, 1,209 మి.మీ. లెగ్‌రూమ్ లభిస్తుంది. 39 స్పీకర్ల డైనాడియో ప్లాటినమ్ ఎవిడెన్స్ ఆడియో సిస్టమ్, 21.4 అంగుళాల పవర్డ్ ఓవర్‌హెడ్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు, వెనుక భాగాల్లో ప్రత్యేక మినీ ఫ్రిజ్‌లు కూడా ఉన్నాయి. ఈ కారులో 532 లీటర్ల బూట్ స్పేస్ అందించారు.
1,000 కి.మీ.కు పైగా రేంజ్..
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. యాంగ్వాంగ్ ఆల్టియర్లో బీవైడీ రెండో తరం బ్లేడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది CLTC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. ఇందులో ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. అయితే ఛార్జింగ్ వేగానికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. బీవైడీ ఈ కారును తన ప్రత్యేకమైన ఈ4 (e4) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది. ఇందులో ప్రతి చక్రానికి సపరేట్ గా పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీనివల్ల అధిక వేగంలో టైర్ పేలినప్పటికీ కారుపై నియంత్రణ, స్థిరత్వాన్ని మెరుగ్గా కొనసాగించవచ్చు.
నీటిలోనూ ప్రయాణం..
ఈ కారులో మరికొన్ని ఆశ్చర్యకరమైన టెక్నాలజీలను అందించారు. ట్యాంక్ టర్న్ ఫీచర్ సాయంతో కారు ఒకే చోట 360 డిగ్రీలు తిరగగలదు. అత్యవసర పరిస్థితుల్లో నీటిపై తేలుతూ, నీటిలోనే స్టీరింగ్ నియంత్రణతో కదిలే సామర్థ్యం కూడా ఉంది. వీటితో పాటు నెక్స్ట్ జనరేషన్ డైసస్ (DiSus) ఫుల్ యాక్టివ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, గాడ్స్ ఐ ఏ (God’s Eye A) నావిగేషన్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
Should Rolls Royce be worried about the YANGWANG ALTIOR by BYD? https://t.co/Q8iZf09svu
— BILLIONAIRE COLLECTION ® (@BillionMagazine) November 10, 2026
తాజావార్తలు
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
Tripura Civic Polls 2026: త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా.. పోటీ లేకుండానే 77 స్థానాలు కైవసం!
-
TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్‌తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
-
Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!