BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Denza India Launch: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రతిసారీ కొత్త కార్ కంపెనీలు రావడం చాలా అరుదుగా జరిగే విషయం. కానీ ఈ ఏడాది మనదేశంలోకి రెండు కొత్త బ్రాండ్లు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటం ఆటోమొబైల్ ప్రేమికుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో జెఎస్డబ్ల్యూ (JSW) రాక ఇప్పటికే ఖాయం కాగా, తన మొదటి కారును కూడా దాదాపు సిద్ధం చేసేసింది. ఇక రెండో బ్రాండ్ విషయానికొస్తే, అది మరెదో కాదు.. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బివైడి (BYD)కి చెందిన హై-ఎండ్ లగ్జరీ బ్రాండ్ ‘డెంజా’ (Denza). డెంజా బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు బివైడి ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి 2010లో బివైడి, ప్రముఖ దిగ్గజ సంస్థ మెర్సిడేస్ బెంజ్ గ్రూప్ కలిసి ఉమ్మడిగా ఈ డెంజా బ్రాండ్‌ను ప్రారంభించాయి. అయితే ఆ తర్వాత ఈ భాగస్వామ్యం నుంచి మెర్సిడేస్ బెంజ్ తప్పుకోవడంతో, బివైడి ఈ బ్రాండ్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, ఒక సూపర్ లగ్జరీ , ప్రామిసింగ్ హై-ఎండ్ బ్రాండ్‌గా రూపుదిద్దింది.
ఇక భారతదేశంలో బివైడి ఇప్పటికే ఉన్న తన వాహనాల రేంజ్ కంటే పైన, అంటే అత్యంత ఖరీదైన ప్రీమియం సెగ్మెంట్లో ఈ డెంజా కార్లను నిలబెట్టాలని చూస్తోంది. మనదేశంలో బివైడి రూ. 20 లక్షల నుంచి రూ. 80 లక్షల రేంజ్లో కార్లను విక్రయిస్తుండగా, రూ. 80 లక్షలు దాటిన లగ్జరీ సెగ్మెంట్‌ను డెంజా కార్లతో భర్తీ చేయనుంది. ఆటోకార్ ఇండియా సమాచారం ప్రకారం, కంపెనీ ప్రారంభంలో రెండు మోడళ్లను భారతదేశంలోకి తీసుకురానుంది. అందులో ఒకటి ‘జెడ్9 జీటీ’ (Z9 GT) కాగా, మరొకటి ‘డి9 లగ్జరీ ఎంపివి’ (D9 Luxury MPV). ఈ రెండింటినీ పూర్తి స్థాయిలో తయారైన కార్లుగా (CBU – కంప్యూట్లీ బిల్ట్ అప్ యూనిట్) నేరుగా దిగుమతి చేసి ఇక్కడ విక్రయించనున్నారు.
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
వీటిలో డెంజా జెడ్9 జీటీ విషయానికి వస్తే.. గ్లోబల్ మార్కెట్లో ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు వెర్షన్లలో లభిస్తున్నప్పటికీ, భారత్‌కు మాత్రం కేవలం ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రమే రానుంది. దాదాపు 2.9 టన్నుల బరువు ఉండే ఈ పవర్ఫుల్ ఈవీలో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి ఏకంగా 1156 హెచ్‌పి (HP) మైండ్ బ్లోయింగ్ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. పనితీరు విషయానికి వస్తే, ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 270 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ కారు, ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌ను ఇస్తుంది. ఈ సూపర్ ఈవీ భారతదేశంలో రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల భారీ బడ్జెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు డెంజా డి9 లగ్జరీ ఎంపివి మోడల్ మార్కెట్లో ఉన్న టొయోటా వెల్ఫైర్ (Toyota Vellfire) వంటి అల్ట్రా-లగ్జరీ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో, ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్లో రానున్న ఈ కారు ధర దాదాపు రూ. 80 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో భారీ 103kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై 520 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 2 + 2 + 3 సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో వచ్చే ఈ రాజసమైన కారులో ప్రయాణికుల కంఫర్ట్ కోసం త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం ఆడియో సిస్టమ్, ఫుల్ లెదర్ అపోల్స్టరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, మిడిల్ రో (మధ్య వరుస)లో కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా ఫోల్డ్-అవుట్ టేబుల్స్, రిలాక్స్ అవ్వడానికి ఎక్స్టెండబుల్ లెగ్ రెస్ట్‌లను కూడా అమర్చారు. సంపన్నులను, లగ్జరీ ఈవీలను కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ డెంజా రాకతో భారత లగ్జరీ కార్ల మార్కెట్ మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!