Site icon NTV Telugu

Bajaj Pulsar 125 vs N125 vs NS125.. ఈ మూడింటిలో ఏ బైక్ ఎవరికి బెస్ట్ ఛాయిస్?

Bajaj

Bajaj

Bajaj Pulsar 125 vs N125 vs NS125: భారత్‌లో దాదాపు 25 ఏళ్లుగా బజాజ్ పల్సర్ దూకుడు కొనసాగుతోంది. ఈ బైక్ విడుదలైన కొత్తలో ప్రత్యేకంగా నలిచింది. ఆకర్శనీయమైన లుక్‌తో యువతను కట్టి పాడేసింది. కాలం మారుతున్నా, యువత అభిరుచులు మారుతున్నా, పల్సర్ మాత్రం తన స్టైల్‌-పెర్ఫార్మెన్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందుకే ఈ రోజు మార్కెట్‌లో పల్సర్ 125, పల్సర్ N125, పల్సర్ NS125 అనే మూడు వేరియంట్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే మూడింట్లో ఏ బైక్ ఎవరికి బెస్ట్ అనే విషయం గురించి తెలుసుకుందాం..

READ MORE: Rahul Sankrityan: ‘ప్రామిస్.. మీ ఆకలి తీరుస్తా’! విజయ్ ఫ్యాన్‌కు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్రేజీ రిప్లై..

ఈ మూడు బైక్‌ల్లో ఇంజిన్ సామర్థ్యం ఒకటే. అన్నీ 124.4 సీసీ ఇంజిన్‌తోనే వస్తాయి. కానీ బజాజ్ ఈ మూడు మోడల్స్‌ను వెరైటీగా రూపొందించింది. సాధారణ పల్సర్ 125 సాఫ్ట్ రైడింగ్‌కు బాగా సూట్ అవుతుంది. N125, NS125 కొంచెం ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. పల్సర్ 125లో పవర్, టార్క్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదే N125, NS125ల్లో స్వల్పంగా ఎక్కువ పవర్ రావడంతో రైడ్ మరింత యాక్టీవ్‌గా అనిపిస్తుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లడం, కాలేజ్ రైడ్స్ లాంటి సాధారణ అవసరాలకు మూడు బైక్‌లు బాగానే ఉంటాయి. సీటింగ్ విషయంలో మూడు సపరేట్‌గా ఉంటాయి. సాధారణ పల్సర్ 125 ఎత్తుగా ఉంటుంది. దీని మీద కూర్చుంటే రోడ్డుపై మంచి నియంత్రణ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎత్తు ఎక్కువ వాళ్లకు ఇది బాగా సెట్ అవుతుంది. అలాగే.. స్పోర్టీ లుక్‌తో పాటు కాస్త వంగిన రైడింగ్ పొజిషన్ కావాలంటే పల్సర్ NS125 మంచి ఎంపిక. ఇది యువతకు నచ్చే స్టైల్‌తో పాటు సౌకర్యంగా కూడా ఉంటుంది. ఇక పల్సర్ N125 మాత్రం కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. నేలకి పాదాలు సులభంగా తాకుతాయి. పొట్టి వాళ్లకు ఉన్నవాళ్లకు, పాడైన రోడ్లపై ఎక్కువగా ప్రయాణించే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ధర విషయానికి వస్తే మూడు బైక్‌ల మధ్య పెద్ద తేడా లేదు. పల్సర్ N125 ధర కొంచెం తక్కువగా ఉంటుంది. పల్సర్ 125, NS125 ధరలు దాదాపు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ధర కంటే మీ అవసరమే ఇక్కడ ముఖ్యం. మొత్తానికి చెప్పాలంటే.. సాధారణ ఉపయోగం, క్లాసిక్ పల్సర్ ఫీలింగ్ కావాలంటే పల్సర్ 125 సరైన ఎంపిక. స్పోర్టీ లుక్, బ్యాలెన్స్ ఉన్న రైడింగ్ కావాలంటే పల్సర్ NS125 బెస్ట్. తక్కువ ఎత్తు, చెడు రోడ్లపై సౌకర్యం కావాలంటే పల్సర్ N125 మీకు సరిపోతుంది. మీ స్టైల్, మీ రైడింగ్ అవసరాన్ని బట్టి మూడింట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోండి.

Exit mobile version