Avor Electric Bike: అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. 260KM రేంజ్, 114Kmph టాప్ స్పీడ్! ధర, ఫీచర్లు ఇవే!
- అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల
- ధరలు రూ.1,24,999 నుంచి ప్రారంభమవుతాయి
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు రేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో కొత్త మోడళ్లు వరుసగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అవోర్ (Avor) కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను EX1, EX2, EX2S అనే మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. వీటి ధరలు రూ.1,24,999 నుంచి ప్రారంభమవుతాయి. టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ బైక్‌కు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
అవోర్ EX1: బేస్ వేరియంట్
అవోర్ EX1 ఈ సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ వేరియంట్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.24 లక్షలు. ఈ మోడల్లో 3.24kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. EX1లో గరిష్టంగా 10bhp పవర్ ఉత్పత్తి అవుతుంది. దీని టాప్ స్పీడ్ 100kmph కాగా, 0-40kmph వేగాన్ని కేవలం 3.2 సెకన్లలో అందుకోగలదని కంపెనీ చెబుతోంది.
Also Read
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఇన్-బిల్ట్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ డిస్ప్లే, సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్, నాలుగు రైడింగ్ మోడ్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
అవోర్ EX2: 255KM రేంజ్
మిడ్-రేంజ్ వేరియంట్ అయిన EX2 ధర రూ.1.49 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇందులో పెద్ద 5kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 255 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వేరియంట్లో కూడా గరిష్టంగా 10bhp పవర్, 100kmph టాప్ స్పీడ్, 0-40kmph వేగాన్ని 3.2 సెకన్లలో అందుకునే సామర్థ్యం ఉన్నాయి. ఛార్జింగ్ విషయంలో కూడా EX2 ఆకట్టుకుంటుంది. ఇన్-బిల్ట్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఇతర ఫీచర్లలో 7-అంగుళాల డిజిటల్ డిస్ప్లే, LED హెడ్‌ల్యాంప్, నాలుగు రైడింగ్ మోడ్లు, Bluetooth, Wi-Fi, డిస్క్ బ్రేక్‌లతో CBS, అలాగే 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉన్నాయి.
అవోర్ EX2S: 260KM రేంజ్‌తో టాప్ వేరియంట్
ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్ EX2S. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.69 లక్షలు. EX2Sలో కూడా 5kWh బ్యాటరీ ఉంటుంది. అయితే ఇది 260 కిలోమీటర్ల వరకు బూస్టింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పవర్ విషయంలో EX2S మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇందులో గరిష్టంగా 14bhp పవర్ ఉత్పత్తి అవుతుంది. దీని టాప్ స్పీడ్ 114kmph కాగా, 0-40kmph వేగాన్ని కేవలం 2.8 సెకన్లలో అందుకోగలదు. ఇందులోని ఇన్-బిల్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు సుమారు 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.
EX2Sలో ముఖ్యమైన ఫీచర్లు
AI టెక్నాలజీతో కూడిన 7-అంగుళాల డిజిటల్ డిస్ప్లే
సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్‌లు
ఆరు రైడింగ్ మోడ్లు
డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు
5kWh బ్యాటరీ
114kmph టాప్ స్పీడ్
260km వరకు క్లెయిమ్ చేసిన రేంజ్
బుకింగ్స్ ప్రారంభం.. త్వరలో డెలివరీలు
అవోర్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ సిరీస్ కోసం బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.799తో బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ సమాచారం ప్రకారం, బుకింగ్‌లు ప్రారంభమైన తర్వాత సుమారు రెండు నెలల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!