Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
- ఏప్రిలియా SR 175
- ప్రారంభ ధర రూ.1.21 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలవనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిలియా ఇండియా తన హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్ శ్రేణిని మరింత విస్తరిస్తూ ఏప్రిలియా SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌ను కొత్త మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్లో విడుదల చేసింది. క్యామోఫ్లేజ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్ దేశభక్తి భావనను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. ప్రత్యేకమైన డిజైన్‌ను కోరుకునే యువతను ఆకట్టుకునేలా ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
కొత్త డిజైన్‌తో ఆకట్టుకుంటున్న SR 175
ఏప్రిలియా ప్రత్యేక ఇటాలియన్ ఇంజినీరింగ్‌కు మిలిటరీ-ఇన్ స్పైర్డ్ డిజైన్‌ను జోడిస్తూ ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌ను రూపొందించింది. స్కూటర్ బాడీపై ఆలివ్ గ్రీన్, ఖాకీ, బ్రౌన్ రంగుల మ్యాట్ ఫినిష్ క్యామోఫ్లేజ్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి తోడు ఫ్లోరోసెంట్ ఆరెంజ్ హైలైట్స్‌ను జోడించడం ద్వారా స్కూటర్‌కు స్పోర్టీ లుక్‌ను అందించారు. ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ ప్యానెల్స్‌పై ఉన్న “Aprilia”, “SR” బ్రాండింగ్ కూడా ఆరెంజ్ రంగులో ఉండటం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
Also Read
- Traffic Rules: పాత బైక్‌లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
- రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
- TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్‌తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
- గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
అల్లాయ్ వీల్స్‌కు స్పోర్టీ టచ్
స్కూటర్లోని బ్లాక్ అల్లాయ్ వీల్స్‌పై ఉన్న రిమ్ టేప్ డిజైన్‌లో కూడా అదే ఫ్లోరోసెంట్ ఆరెంజ్ రంగును ఉపయోగించారు. దీంతో మొత్తం స్కూటర్ మరింత ఆకర్షణీయంగా, రేసింగ్ స్టైల్‌ను ప్రతిబింబించేలా కనిపిస్తోంది.
ఇంజిన్, పనితీరు
డిజైన్‌లో మార్పులు చేసినప్పటికీ, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఏప్రిలియా SR 175 ట్రిబ్యూట్లో అదే 175cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు.
ఈ ఇంజిన్:
7,200 rpm వద్ద 13.08 bhp పవర్, 6,000 rpm వద్ద 14.14 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన పనితీరు, స్మూత్ రైడింగ్ అనుభవం కోసం ఈ ఇంజిన్‌ను ట్యూన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.
ధర ఎంత?
భారత మార్కెట్లో ఏప్రిలియా SR 175 శ్రేణి ప్రారంభ ధర రూ.1.21 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త మ్యాట్ గ్రీన్ ట్రిబ్యూట్ ఎడిషన్ కూడా ఇదే ధర పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్స్ కు ఈ కొత్త క్యామోఫ్లేజ్ థీమ్ కూడా చేరడంతో, ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలవనుంది. స్టైలిష్ లుక్, స్పోర్టీ పనితీరు, ప్రత్యేక మిలిటరీ-ఇన్ స్పైర్డ్ డిజైన్ కోరుకునే యువతకు ఏప్రిలియా SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారే అవకాశముంది.
తాజావార్తలు
-
Upcoming Movies: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా.. ఇయర్ ఎండ్‌లో థియేటర్లను షేక్ చేయనున్న భారీ చిత్రాలివే..!
-
Air India Hijack Threat: టేకాఫ్‌కు ముందే విమానంలో హైజాక్ నోట్.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
-
Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Ramayana Box Office Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సునామీ.. 6 రోజుల్లోనే సరికొత్త రికార్డులు
-
Vijayasai Reddy PRP Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి పార్టీ పేరు.. జెండా ఇదే..!
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!