Site icon NTV Telugu

2026లో రాబోతున్న 5 కొత్త 7-సీటర్ SUVలు ఇవే..

Automobiles

Automobiles

New 7-Seater SUVs: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి ఈ ఏడాది కొత్తగా చాలా కార్లు రాబోతున్నాయి. వీటిలో ఐదు 7-సీటర్ SUVలు కూడా ఉన్నాయి. కొత్తగా రాబోతున్న ఈ కార్లు పెట్రోల్, డిజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి.

1) వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-Line (Volkswagen Tayron R-Line)

జర్మన్ ఆటో మేకర్ వోక్స్‌వ్యాగన్ తన ఫ్లాగ్ షిప్ SUVని రిలీజ్ చేయబోతోంది. టైగున్ R-Line పైస్థాయిలో ఈ కారు ఉండబోతోంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 204 హెచ్‌పీ పవర్, 320Nm టార్క్‌‌ను కలిగి ఉంటుంది. 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో ఆల్‌-వీల్ డ్రైవ్(AWD) సిస్టమ్ ఉంటుంది. సీకేడీ రూపంలో మార్కెట్‌లోకి ఈ కారు రాబోతోంది.

2) MG మేజెస్టర్ (MG Majestor): 

ఎంజీ మోటార్స్ భారత మార్కెట్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈవీ కార్‌లలో సక్సెస్ అయిన ఎంజీ ఈ ఊపును కొనసాగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే MG మోటార్ తమ గ్లోస్టర్ SUVకి ప్రత్యామ్నాయంగా MG మేజెస్టర్‌ను ప్రవేశపెట్టనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దీనిని ప్రదర్శించారు. ఫిబ్రవరి 12న ఈ కార్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు, 210 హెచ్‌పీ పవర్, 478 Nm టార్క్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్‌ కలిగి ఉండే అవకాశం ఉంది. ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో పాటు లగ్జరీకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

3) నిస్సాన్ న్యూ 7-సీటర్:

నిస్సాన్ భారత మార్కెట్లో టెక్టన్ ఎస్‌యూవీని గ్రావిట్ ఎంపీవీతో పాటు విడుదల చేసేందుకు సిద్ధమైంది. వీటి తర్వాత నిస్సాన్, CMF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన కొత్త ఏడు-సీటర్ ఎస్‌యూవీని దేశంలో విడుదల చేయనుంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుంది. మార్కెట్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు బ్రాండ్ వ్యూహాలను రచించింది.

4) మహీంద్రా స్కార్పియో-N ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio-N Facelift):

మహీంద్రా తన స్కార్కియో-N ఫేస్‌లిఫ్ట్‌ను కొత్తగా తీసుకురాబోతోంది. 2022లో మార్కెట్‌లోకి వచ్చిన స్కార్పియో ఎన్, మహీంద్రాకు మంచి అమ్మకాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌గా రాబోతోంది. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకుండా, ప్రస్తుత మోడల్‌లో ఉన్న ఇంజన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను కలిగి ఉండే అవకాశం ఉంది.

5) రెనాల్ట్ బోరియల్ (Renault Boreal):

రెనాల్ట్ భారత్‌తో తన న్యూ జనరేషన్ డస్టర్ లాంచ్ తర్వాత, రెనాల్ట్ 7-సీటర్ వెర్షన్ బోరియల్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. డస్టర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై బొరియల్ నిర్మితమవుతుంది. ఇది లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, మరిన్ని ఫీచర్లనను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Exit mobile version