Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
- రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
- 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు
- కొత్త డిజైన్‌తో మరింత స్టైలిష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో 2026 Renault Kwid Faceliftను అధికారికంగా విడుదల చేసింది. కొత్త క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.52 లక్షలు. ఈ హ్యాచ్‌బ్యాక్ ఎవల్యూషన్ (Evolution), క్లైంబర్ (Climber) అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 5-స్పీడ్ మాన్యువల్, ఈజీ-ఆర్ AMT గేర్‌బాక్స్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది.
కొత్త డిజైన్‌తో మరింత స్టైలిష్
2026 క్విడ్‌లో బాహ్య, అంతర్గత డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా టెయిల్‌గేట్‌పై ఉన్న KWID లోగోకు కొత్త ఫాంట్, సిల్వర్ ఫినిష్ ఇచ్చారు. అలాగే కొత్త 3D Renault బ్యాడ్జ్, 14-అంగుళాల స్టీల్ వీల్స్‌కు డ్యూయల్-టోన్ వీల్ కవర్లు జోడించి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
Also Read
- Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు
భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త క్విడ్‌లో మొత్తం 17 ప్రామాణిక భద్రతా ఫీచర్లను అందించారు. వాటిలో ముఖ్యమైనవి:
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు
ABS with EBD
సీట్‌బెల్ట్ రిమైండర్
రియర్ వ్యూ కెమెరా
పార్కింగ్ గైడ్‌లైన్స్
మెరుగైన బ్రేకింగ్ భద్రత
ఫీచర్లలో మరింత అప్‌గ్రేడ్
కొత్త క్విడ్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందించారు. ఇది Apple CarPlay, Android Autoకు సపోర్ట్ చేస్తుంది. అలాగే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, USB కనెక్టివిటీ, బ్లూటూత్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు
2026 Renault Kwidలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఈజీ-ఆర్ AMT గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.
బూట్ స్పేస్
కొత్త క్విడ్‌లో 279 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, 184 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తో భారతీయ రోడ్లకు అనువుగా రూపొందించారు.
రెండు వేరియంట్లకు ధర తగ్గింపు
2026 అప్డేట్తో కంపెనీ ఎవల్యూషన్ వేరియంట్ ధరను రూ.14,000, క్లైంబర్ వేరియంట్ ధరను రూ.32,000 వరకు తగ్గించింది. అదే సమయంలో గతంలో ఉన్న Authentic, Techno వేరియంట్లను నిలిపివేసింది.
2026 Renault Kwid ధరలు (ఎక్స్-షోరూమ్)
వేరియంట్
మాన్యువల్ AMT
Evolution రూ.4,52,900 రూ.4,89,900
Climber రూ.5,14,900 రూ.5,60,900
తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్, 17 భద్రతా ఫీచర్లు, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలతో 2026 Renault Kwid Facelift ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!