NTV Telugu Site icon

2025 Honda Activa: ‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..

2025 Honda Activa 125

2025 Honda Activa 125

2025 Honda Activa: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్తగా 125 సీసీ హోండా యాక్టివాను తీసుకువచ్చింది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో పాటు మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు అందిస్తోంది. రూ. 94,422 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో యాక్టివాను ఇంట్రడ్యూస్ చేశారు. లేటెస్ట్ ‘‘ఉద్గార నిబంధనలకు’’ అనుగుణంగా యాక్టివా ఉండనుంది. 6 కలర్స్‌తో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లతో వస్తోంది.

READ ALSO: Game Changer: ఇంటర్వెల్‌ బ్లాక్‌ బస్టర్‌.. రామ్‌ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్‌ రివ్యూ

2025 యాక్టివా 125 అప్‌గ్రేడ్ చేయబడిని 123.92 సీసీ, సింగిలి-సిలిండర్ PGM-Fi (ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్) ఇంజన్‌తో 6.20 kW పవ, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో ఇడ్లిండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమయాల్లో ఎక్కువ సేపు స్టాపుల్లో ఉంటే, ఆటోమేటిక్‌గా ఇంజన్‌ని ఆపేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.

యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. జర్నీలో మొబైల్స్ వంటికి ఛార్జింగ్ చేసుకునేందుకు సహకరిస్తుంది. పెరల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెరల్ సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ ప్రెషియస్ వైట్ అనే ఆరు కలర్‌లతో వస్తోంది. DLX వేరియంట్ ధర రూ. 94,442 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), అయితే H-స్మార్ట్ ధర రూ. 97,146 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.