NTV Telugu Site icon

Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. బుకింగ్, ధర, ఫీచర్లు ఇవే..

Kia Sonet Facelift

Kia Sonet Facelift

Kia Sonet facelift: న్యూ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024 ఈ రోజు ఆవిష్కరించబడింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కార్లలో కియా సోనెట్ ఒకటి. గతంలో పోలిస్తే మరింత స్టైలిష్‌గా, టెక్ లోడెడ్‌గా కారు రాబోతోంది. డిసెంబర్ 20 నుంచి న్యూ సోనెట్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. కియా సోనెట్ ఎండీ అండ్ సీఈఓ టే జిన్ పార్క్ మాట్లాడుతూ.. భారత దేశంలో 1.1 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని, కొరియా, అమెరికా, యూరప్ తర్వాత ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ ఉందని చెప్పారు. 2020లో తొలిసారిగా కియా సోనెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపుగా 3,68,000 యూనిట్ల అమ్మకాలను సాధించి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో సోనెట్ ఒకటిగా నిలిచింది.

ఫీచర్లు ఇవే:

2024 కియా సోనెట్ ఫే‌స్‌లిఫ్ట్ 10 ADAS ఫీచర్లు మరియు 15 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో సహా 25 సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ADAS ఫీచర్లు విషయానికి వస్తే..ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్-అవాయడ్ అసిస్ట్, లేన్ కీపిం, లేన్ అటెన్షన్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వేహికిల్ డిపార్చర్ అలర్ట్ ఉన్నాయి. కొత్త సోనెట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్‌గా ఉంటున్నాయి.

సెగ్మెంట్-ఉత్తమ సౌండ్ యాంబియంట్ లైటింగ్
10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
రిమోట్ విండో అప్ / డౌన్
వెనుక డోర్స్ సన్‌షేడ్ కర్టెన్లు
ఎయిర్ ప్యూరిఫైయర్
70+ కనెక్టివిటీ ఫీచర్‌లతో కియా కనెక్ట్
మాట్ ఫినిష్ కలర్‌తో X-లైన్
iMT తో డీజిల్ ఇంజన్
డిఫరెంట్ అల్లాయ్ వీల్ ఆప్షన్స్

ఇంజన్, ట్రాన్స్‌మిషన్, ధర:

2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ X-లైన్, GT-లైన్, టెక్-లైన్‌ వంటి మూడు ట్రిమ్ వేరియంట్లతో పాటు మూడు ఇంజన్ ఆప్షన్స్, 5 ట్రాన్స్మిషన్ ఆఫ్షన్స్ ఉన్నాయి. స్మార్ట్ స్ట్రీమ్ జీ1.2 లీటర్ పెట్రోల్(83PS/115Nm), స్మార్ట్ స్ట్రీమ్ G1.0 లీటర్ T-Gdi పెట్రోల్ (120PS/172Nm), 1.5 లీటర్ CRDi VGT డీజిల్ (116PS/250Nm) ఇంజన్ ఆప్షన్ల ఉన్నాయి. వీటిలో 1.2 పెట్రోల్‌తో 5-స్పీడ్ MT, 1.0 టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT, మరియు 1.5 డీజిల్‌తో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ AT ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం సోనెట్ ఫేస్ లిఫ్ట్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షలు(ఎక్స్-షోరూం) మధ్య ఉండొచ్చని అంచనా. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300 వాటిలో పోటీ పడనుంది.

Show comments