ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో పదవిని ఆశించి నిరాశకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి మలివిడతలోనూ స్థానం దక్కలేదు.. దీనిపై తీవ్రమైన ఆవేదనకు గురైన కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు ఎంతో అనుబంధం కలిగి ఉన్నానని, టీడీపీ హయాంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్న ఆయన.. జగన్ ఓదార్పు యాత్రలో ఎంతో బాధ్యత మోశానని గుర్తుచేసుకున్నారు.. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే బాధ ఇంకా నాలో ఉందన్న ఆయన.. అయినా సీఎం వైఎస్ జగన్ చెపిన్నట్లు నడుచుకుంటానని తెలిపారు.. నెల్లూరు రూరల్ మండలం గొల్ల కందుకూరులో గడప గడపకూ కార్యక్రమం ప్రారంభించిన కోటంరెడ్డి.. జగన్ ఆదేశాలే శిరోధార్యంగా భావించి పనిచేస్తానన్నారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
Kotamreddy: మంత్రపదవి రాలేదన్న బాధ ఇంకా ఉంది.. అయినా జగన్ కోసం పనిచేస్తా..

Kotamreddy Sridhar Reddy